Share News

teachers problem: సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పనిచేయాలి

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:03 AM

teachers problem: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పనిచేయాలని యూటీఎఫ్‌ నాయకులు పిలుపునిచ్చారు. కాకినాడలో జనవరి ఐదు నుంచి ఎనిమిదో తేదీ వరకూ జరిగే యూటీఎఫ్‌ సర్ణోత్సవ మహాసభలను విజయవంతం చేయాలని గురువారం మెళియాపుట్టిలో ప్రచార యాత్రను ప్రారంభిం చారు.

teachers problem: సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పనిచేయాలి
మెళియాపుట్టి: ప్రచారయాత్ర నిర్వహిస్తున్న యూటీఎఫ్‌ నాయకులు::

మెళియాపుట్టి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పనిచేయాలని యూటీఎఫ్‌ నాయకులు పిలుపునిచ్చారు. కాకినాడలో జనవరి ఐదు నుంచి ఎనిమిదో తేదీ వరకూ జరిగే యూటీఎఫ్‌ సర్ణోత్సవ మహాసభలను విజయవంతం చేయాలని గురువారం మెళియాపుట్టిలో ప్రచార యాత్రను ప్రారంభిం చారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరావు, కార్యదర్శి కిషోర్‌, ఆర్‌.మోహన్‌రావు, శ్రీలక్ష్మి ,బాబురావు, రామ్మూర్తి, చలం, రమణ పాల్గొన్నారు.


  • ఫ పాతపట్నం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కాకినాడలో జనవరి ఐదు నుంచి ఎనిమిదో తేదీ వరకూ జరిగే యూటీఎఫ్‌ స్వర్ణోత్సవాలు విజయవంతం చేయాలని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. పాతపట్నంలో యూటీఎఫ్‌ పతాకాన్ని ఆవిష్కరించడంతోపాటు జాతా నిర్వహించారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌, జిల్లా అధ్యక్షకార్యదర్శులు బాబూరావు, బమ్మిడి శ్రీరామ్మూర్తి, మండలఅధ్యక్ష కార్యదర్శులు మోహనరావు, గొంటి గిరిధర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 12:03 AM