Share News

సమన్వయంతో పనిచేయాలి

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:03 AM

రానున్న వర్షాకాలంలో వ్యవసాయ, వైద్య, ఆరోగ్య శాఖ, విద్యుత్తు శాఖలకు పని ఒత్తిడి అధికంగా ఉంటుందని, ఆయా శాఖల అధికారులు సమన్వ యంతో పనిచేసి సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ పిరి యా విజయ అన్నారు.

సమన్వయంతో పనిచేయాలి

అరసవల్లి: రానున్న వర్షాకాలంలో వ్యవసాయ, వైద్య, ఆరోగ్య శాఖ, విద్యుత్తు శాఖలకు పని ఒత్తిడి అధికంగా ఉంటుందని, ఆయా శాఖల అధికారులు సమన్వ యంతో పనిచేసి సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ పిరి యా విజయ అన్నారు. జడ్పీ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన జడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశానికి ఆమె అధ్యక్ష త వహించి మాట్లాడారు. ఈ స మావేశంలో ఆమె వివిధ శాఖల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సంద ర్భంగా వ్యవసాయాధికారి కె.శీధర్‌ మాట్లాడుతూ.. ఈ ఖరీఫ్‌ సీజన్‌కు 1.70 లక్షల హెక్టార్లలో పంటలు పండించేందుకు ప్రణాళికలు రూపొందించామని, దాదాపు 36 వేల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ నెల 6 నుంచి రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంటాయన్నారు. డ్వామా పీడీ చిట్టిరాజు మాట్లాడుతూ.. ఇప్పటివరకు 33 రోజుల సగటు పనిదినాలు కల్పించామని డ్వామా పీడీ చిట్టిరాజు తెలిపారు. వచ్చే మార్చి నాటికి జిల్లాలో జాబ్‌ కార్డు ఉన్నవారందరికీ 75 రోజుల పనిదినాలను కల్పిస్తామని తెలిపారు. జిల్లాలోని 1.55 లక్షల కుటుంబాలకు వంద రోజుల పని కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. డీఎంహెచ్‌వో బి.మీనాక్షి మాట్లాడుతూ.. కిడ్నీ వ్యాధిగ్రస్థులకు సైతం జిల్లాలో మందులు అందుబాటులో ఉన్నాయని, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ విధానం ద్వారా అవసరమైన వారికి అన్ని రకాల మందులు పూర్తిస్థాయిలో అండుబాటులో ఉంచామన్నారు. సమావేశంలో జడ్పీ వైస్‌ చైర్మన్లు సిరిపురపు జగన్‌, పాలిన శ్రావణి, జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ పొన్నాడ సుధాకర్‌, బీసీ కార్పొరేషన్‌ ఈడీ గడ్డెమ్మ, సెట్‌శ్రీ సీఈవో ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2024 | 12:03 AM