Share News

టీడీపీ విజయానికి కృషి చేయండి

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:06 AM

రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క రూ కృషిచేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌ కోరారు. సోమవారం వంజంగి మాజీ సర్పంచ్‌ ఎండ అప్పల నాయుడు ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 40 దళిత కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి.

టీడీపీ విజయానికి కృషి చేయండి
ఆమదాలవలస: రవికుమార్‌ సమక్షంలో టీడీపీలో చేరుతున్న వంజంగి వైసీపీ నాయకులు

పార్టీ జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌

ఆమదాలవలస: రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క రూ కృషిచేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌ కోరారు. సోమవారం వంజంగి మాజీ సర్పంచ్‌ ఎండ అప్పల నాయుడు ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 40 దళిత కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో విధ్వంసకర పాలనతో దళిత వర్గాలను అన్ని విధాలుగా అణగదొక్కిన జగన్‌ దళిత ద్రోహి అన్నారు. వైసీపీ నాయకులు కళ్యాణ్‌ రాము, చింతాడ గణేష్‌, అలమండ తాతా రావు, దవళ గణపతిరావు, కొన్ని సోములు, ముక్కు నారాయణ తదితరులు టీడీపీలో చేరారు.

సమష్టిగా కృషి చేయాలి: ఎమ్మెల్యే అశోక్‌

కవిటి: ఇచ్ఛాపురం నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయ కులు సమష్టిగా కృషిచేసి టీడీపీ విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే బి.అశోక్‌ పిలుపునిచ్చారు. సోమవారం కవిటిలో నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు ప్రకటిం చిన సూపర్‌సిక్స్‌ పథకాలను ప్రతి ఇంటికీ తెలియజేయాల న్నారు. జగన్‌రెడ్డి అరాచకాలు సృష్టించి ఎన్నికలు నిర్వహణకు సిద్ధమవుతున్నారని, వాటిని అధిగమించి పార్టీని గెలిపిం చాలన్నారు. సమావేశంలో కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, సోంపే ట మండలాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని ఇచ్ఛా పురం ఎమ్మెల్యే సతీమణి బి.నీలోత్పల అన్నారు. సోమవారం బి.గొన పపుట్టుగ పంచాయతీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే అమలు చేయబోయే సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరించారు.

టీడీపీ నాయకుల ఆత్మీయ కలయిక

సరుబుజ్జిలి: మండలంలోని 21 పంచాయతీల్లో పార్టీ నాయకులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తు న్నట్టు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శివ్వాల సూర్యనారాయణ తెలిపారు. సోమ వారం షలంత్రి, సింధువాడ పంచాయతీల్లో ఆత్మీయ సమా వేశం నిర్వహించారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధిలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తూ ఎన్నికల్లో వ్యవహరిం చాల్సిన విధి విధానా లపై పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు అంబళ్ల రాంబాబు, కిల్లి సిద్దార్థ, లావేటి పూర్ణారావు, తాడేల వెంకటరమణ, అత్తులూరి హరిబాబు, కందుల వెంకటరావు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 12:06 AM