Share News

మహిళల ఆశీర్వాదమే కీలకం

ABN , Publish Date - Apr 22 , 2024 | 11:49 PM

జిల్లాలో ఏడు నియోజకవర్గాలు, ఒక లోక్‌సభ సెగ్మెంట్‌లో అభ్యర్థుల గెలుపునకు మహిళా ఓటర్లే కీలకంగా మారారు. గత రెండు దశాబ్దాలుగా వీరి తీర్పే అభ్యర్థుల విజయావకాశాలను నిర్ణయిస్తోంది. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉండడం... గంపగుత్తగా ఓట్లు వేయడం వల్ల వీరి ప్రభావం అధికంగా ఉంది. 2024 ఎన్నికల్లో కూడా మహిళా ఓటర్లే కీలకంగా మారనున్నారు. జిల్లాలో పురుషులు, మహిళల ఓటర్లు మొత్తం 16,26,908 మంది ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 8,04,721 మంది, మహిళా ఓటర్లు 8,22,187 మంది ఉన్నారు. పురుషుల కంటే 17,466 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉండడం విశేషం. జిల్లాలోని మొత్తం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఎచ్చెర్ల నియోజకవర్గం విజయనగరం లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలో ఉంది. మిగిలిన ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఇందులో అత్యధికంగా శ్రీకాకుళం నియోజకవర్గంలో 1,37,488 మంది మహిళా ఓటర్లు ఉండగా, 1,37,254 మంది మహిళా ఓటర్లతో ఇచ్ఛాపురం నియోజకవర్గం రెండో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయపార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం మహిళా ఓటర్ల కోసం మేనిఫెస్టోలో ప్రత్యేక పథకాలు మహిళలకు ప్రకటిస్తున్నాయి. కొత్త కొత్త పథకాలతో మహిళా ఓటర్లను ఆకర్షించే పనిలో తలమునకలయ్యాయి. ఏదేమైనా జిల్లాలో రానున్న ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించేది మహిళా ఓటర్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. మరి వీరంతా ఎవరిని ఆశీర్వదిస్తారో చూడాలి.

మహిళల ఆశీర్వాదమే కీలకం

(కలెక్టరేట్‌)

Updated Date - Apr 22 , 2024 | 11:49 PM