Share News

మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధించాలి

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:12 AM

మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధించడం ద్వారా ఉన్నత స్థానా లను అధిరోహించాలని ఎస్పీ జీఆర్‌ రాధిక అన్నారు. రెంటికోట గ్రామంలో శుక్రవారం అంత ర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిం చారు.

మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధించాలి
నృత్య కళాకారిణులకు బహుమతులు అందిస్తున్న ఎస్పీ రాధిక

పలాసరూరల్‌: మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధించడం ద్వారా ఉన్నత స్థానా లను అధిరోహించాలని ఎస్పీ జీఆర్‌ రాధిక అన్నారు. రెంటికోట గ్రామంలో శుక్రవారం అంత ర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తు తం మహిళలు విద్య, ఇతర అంశాల్లో ఉన్నతి సాధించాలని, సామాజిక మాధ్యమాలు, ఇతర వ్యాప కాల్లో పడి జీవితాన్ని వృఽథా చేసుకో వద్దన్నారు. అంతర్జాతీయంగా మహిళలు అన్ని రంగాల్లో విజ యాలు సాధిస్తున్నారని అయితే చిన్నపాటి కుటుంబ తగాదాల వల్ల ఇతర అంశాలకు ఆకర్షితులై జీవితాన్ని పక్క దారి పట్టకూడదన్నారు. మహిళలు వేసే ప్రతీ అడుగు ఆచితూచి వేయాలని, ఇతరుల మాటలు నమ్మి మోసపో వద్దన్నారు. ప్రమాదంలో ఉండే మహిళలు దిశ యాప్‌ను ఓపెన్‌ చేసి ఐదుసార్లు మొబైల్‌ను కదిలిస్తే దగ్గరలో ఉన్న ఎస్‌హెచ్‌వోకు మీ వివరాలు అందడం ఆపద నుంచి బయట పడవచ్చన్నారు. ఈ సందర్భంగా వృద్ధ మహిళలకు చీరలు, బాలికలకు శానిటరీ కాస్మెటిక్స్‌ అందించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు చేసిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఆకటు ్టకున్నాయి. కార్యక్రమంలో ఏఎస్పీ జి.ప్రేమ్‌ కాజల్‌, డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సీఐ ఎల్‌హెచ్‌ విజయానంద్‌, సర్పంచ్‌ శాసన పురి తిరుమల, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2024 | 12:12 AM