Share News

మహిళలే నిర్ణేతలు

ABN , Publish Date - May 15 , 2024 | 12:25 AM

సార్వత్రిక ఎన్నికలలో విజయావకాశాలపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు విజయావకాశాలపై ఽధీమా వ్యక్తం చేస్తున్నారు. అధిక శాతం నియోజకవర్గాలలో పురుషుల కంటే మహిళల ఓటింగ్‌ శాతం ఎక్కువగా ఉంది. దీంతో అభ్యర్థుల గెలుపు.. ఓటములలో వీరే ప్రఽధాన పాత్ర పోషించనున్నారు.

మహిళలే నిర్ణేతలు

సార్వత్రిక ఎన్నికలలో విజయావకాశాలపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు విజయావకాశాలపై ఽధీమా వ్యక్తం చేస్తున్నారు. అధిక శాతం నియోజకవర్గాలలో పురుషుల కంటే మహిళల ఓటింగ్‌ శాతం ఎక్కువగా ఉంది. దీంతో అభ్యర్థుల గెలుపు.. ఓటములలో వీరే ప్రఽధాన పాత్ర పోషించనున్నారు.

ఇచ్ఛాపురం, సోంపేట, కంచిలి, మే 14: ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. చిన్న, చిన్న సమస్యలు తప్ప సజావుగా జరగటంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఓటర్లు రాత్రి 9 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో 299 పోలింగ్‌ స్టేషన్లలో చెదురుమొదురు సంఘటనలు మినహా సజావుగా జరిగింది. 2019 నాటి ఎన్నికల్లో 70.23 శాతం పోలింగ్‌ కాగా ఈ ఏడాది 69.77శాతానికే పరిమితమైంది. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో 2,68,202 మంది ఓటర్లు ఉండగా 1,87,136 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో మహిళలు 1,02,778 (74.78 శాతం)మంది, పురుషులు 84,356 (64.52 శాతం)మంది, థర్డ్‌ జెండర్స్‌ 12.94శాతం ఓటు హక్కును వినియోగిచుకున్నారు. మహిళలే అత్యధికంగా ఓటు వినియోగించుకోవటం విశేషం. పురుషుల కంటే మహిళలు 18,422మంది అధికంగా ఓటు వినియోగించుకున్నారు.

ఫ కవిటి మండలంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడి చేయటంతో పోలీసులు రంగప్రవేశం చేసి గొడవలను ఆపారు.

రాత్రి వరకు పోలింగ్‌..

ఇచ్ఛాపురంలో 12, 55 పోలింగ్‌ కేంద్రాలు, కవిటి మండలం బల్లిపుట్టుగ, ఇద్దివానిపాలెం, బెలగాం, కంచిలి మండలంలో బూరగాం, బురదపాడు, సోంపేట మండలంలో తాళపద్ర, గొల్లూరు, కర్తలిపాలెం పోలింగ్‌ కేంద్రాలలో రాత్రి 8.30గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. పోలింగ్‌ సరళిని చూసి ఏ పార్టీకి ఆ పార్టీ తమ దే విజయమని ధీమా వ్యక్తం చేస్తోంది. కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువతరం చంద్రబాబు నాయుడపై నమ్మకంతో కూటమికే ఓట్లు వేశారని టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ విశ్వసిస్తున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు అధికార పార్టీ విధానాలతో విసుగెత్తిపోయి ఉన్నారని, వారంతా కూటమి వెంటే ఉన్నారని చెబుతున్నారు. మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్‌కు తరలివచ్చారని వారి ఓట్లు తమకే పడతాయని వైసీపీ భావిస్తోంది.

మహిళా ఓటర్లలో చైతన్యం

టెక్కలి, మే 14: టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈ విడత 2లక్షల 36వేల 327 మంది ఓటర్లకు గాను లక్షా 86వేల 897 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 95,569 మంది, పురుషులు 91,326 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 4,243 మంది అధికంగా ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. మొత్తంగా టెక్కలి నియోజకవర్గంలో 79.01శాతం పోలింగ్‌ జరిగినట్లు ఆర్‌వో నూరుల్‌ ఖమర్‌ వెల్లడించారు. 2019 ఎన్నికల్లో పోలింగ్‌ 78.02శాతం నమోదైంది. గత ఎన్నికల కంటే సుమారుగా ఒకశాతం ఓటింగ్‌ పెరిగింది. రాత్రి 10గంటల వరకు టెక్కలి మండలం చాకిపల్లి, కోటబొమ్మాళి మండలం దంతలో పోలింగ్‌ ప్రక్రియ జరిగింది. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా 280 పోలింగ్‌ స్టేషన్లలో వెబ్‌ కెమెరాలు ఏర్పాటుచేసి వాటి పర్యవేక్షణకు ప్రత్యేకంగా అధికారులను నియమించారు. టెక్కలి నియోజకవర్గ పరిధిలో 315 పోలింగ్‌ స్టేషన్లలోను ప్రశాంతంగా ఓటింగ్‌ జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

పలాస రూరల్‌: పలాస నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2లక్షల 19వేల 348 కాగా ఇందులో పురుషులు 1 లక్షా 7వేల 278 మంది. మహిళలు 1లక్షా 12వేల 049 మంది, ఇతరులు 21 మంది ఉన్నారు. సోమవారం జరిగిన ఎన్నికలలో పురుషులు 76వేల 839మంది, మహిళలు 88వేల 416 మంది ఓట్లు వేశారు. మొత్తం లక్షా 65వేల 257మంది ఎన్నికల్లో ఓట్లు వేశారు. పోలింగ్‌ 75.34శాతం గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. మహిళల ఓట్లే విజేతను నిర్ణయించనున్నాయని విశ్లేషకుల అంచనా.

ఎవరి లెక్కలు వారివే!

మెళియాపుట్టి, మే 14: పోలింగ్‌ ప్రక్రియ పూర్తి కావటం.. ఓట్ల లెక్కింపునకు మరో 20 రోజులు ఉండడంతో అభ్యర్థులు గెలుపు ఓటములపై లెక్కలు వేసుకుంటున్నారు. పాతపట్నం నియోజకవర్గంలో 70.37 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇది కూటమి అభ్యర్థికి కలసి వస్తుందని అంచనాలు వేసుకుంటున్నారు. ఈ లెక్కలు అధికార వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల ఓటర్లు వైసీపీకి అనుకూలంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. నియోజకవర్గం లో మొత్తం 2,25,313 ఓట్లు ఉండగా.. 1,58,544 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 77,803 మంది, మహిళలు 80,738 మంది ఉన్నారు. అధికంగా మహిళలే ఓటు హక్కు వినియోగించుకున్నారు. పల్లెల్లోనూ ఎక్కడికక్కడ ఎన్నికల ఫలితాలపైనే జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

హిరమండలం: హిరమండలం మండలంలో సోమవారం నిర్వ హించిన సార్వత్రిక ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలలే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలంలో మొత్తం 70 శాతం పోలింగ్‌ నమోదైనట్లు తహసిల్దారు సుధాకర్‌ చెప్పారు. 23 పంచాయతీల్లోని 45 పోలింగ్‌ బూతుల పరిధిలో 32,447 మంది ఓటర్లుకు గాను 23,352 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో స్త్రీలు 9,290 మంది, పురుషులు 8,961 మంది ఉన్నారు.

Updated Date - May 15 , 2024 | 12:26 AM