Share News

మహిళలే టీడీపీ రథసారథులు

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:15 AM

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిరావం నుంచి ప్రతి ఎన్నికల విజయంలోనూ మహిళలు టీడీపీ రథసారధులుగా నిలుస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు.

మహిళలే టీడీపీ రథసారథులు
బూర్జ: సమావేశంలో మాట్లాడుతున్న కూన రవికుమార్‌

- పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌

సరుబుజ్జిలి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిరావం నుంచి ప్రతి ఎన్నికల విజయంలోనూ మహిళలు టీడీపీ రథసారధులుగా నిలుస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు. గురువారం సరుబుజ్జిలి మండలం అమృత లింగానగరం వద్ద మండల టీడీపీ అధ్యక్షుడు అంబళ్ల రాంబాబు అధ్యక్షతన జయహో బీసీ మహిళా సమావేశాన్ని నిర్వహించారు. రవికుమార్‌ మాట్లాడుతూ.. అబద్దాలు, అపనమ్మకాలు, అరాచకాలు, శవ రాజకీయాల పునాదులపై సైకో సీఎం జగన్‌రెడ్డి వైసీపీ నడుస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్‌ పేడాడ సూరపునాయుడు, టీడీపీ నాయకులు శివ్వాల సూర్యనారాయణ, కిల్లి సిద్దార్థ, పల్లి సురేష్‌, నందివాడ గోవిందరావు, పేడాడ మణికుమారి, బీజేపీ, జనసేన పార్టీల మండల అధ్యక్షుడు వేల్పుల గోవిందరావు, పైడి మురళీమోహన్‌ పాల్గొన్నారు.

అభివృద్ధిపై దృష్టి సారిస్తా..

బూర్జ: రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి మహిళలు సహకరించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ కోరారు. కొల్లివలసలోని పార్టీ కార్యాల యం ఆవరణలో టీడీపీ మహిళా శక్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మండల మహిళా అధ్యక్షుడు కాంతమ్మ, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌, మాజీ జడ్పీటీసీ ఆనేపు రామకృష్ణనాయుడు, మొదలవలస రమేష్‌, పార్టీ మండల అధ్యక్షుడు రాంజీ, బీజేపీ నాయకులు సూరపునాయుడు, జనసేన పార్టీ నాయకులు విక్రమ్‌, జయరాం తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ రహిత రాష్ట్రమే కూటమి లక్ష్యం

శ్రీకాకుళం అర్బన్‌: వైసీపీ పాలనల నుంచి రాష్ట్ర ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని, ఆ దిశగా ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పాటైందని ఆ పార్టీల నాయకులు అన్నారు. స్థానిక టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు గురువారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోనాలను దృష్టిలో ఉంచుకుని ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పాడ్డాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులు, జరగాల్సిన అభివృద్ధి కోసమే జతకట్టాయని తెలిపారు. జగన్‌రెడ్డి అరచాక పాలన నుంచి రాష్ర్టాన్ని కాపాడేందుకు ఈ కూటమి ప్రజలోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి సంపద సృష్టించి ప్రతీ ఆంధ్రుడికి అండగా నిలుస్తుందని భరోసా నిచ్చారు. రాష్ట్రంలో దళితలకు స్వేచ్ఛలేకుండా పోయిందన్నారు. సమావేశంలో కూటమి నాయకులు చిట్టిమోహన్‌, బిర్లంగి ఉమామహేశ్వరరావు, పిసిని చంద్రమోహన్‌, కోరాడ సర్వేశ్వరరావు, భాస్కరరావు, రామరాజు తదితరులు పాల్గొన్నారు.

అరాచక పాలనను అడ్డుకునేందుకే..

శ్రీకాకుళం రూరల్‌: రాష్ట్రంలో వైసీపీ మూకల దాడులను, అరాచక పాలన ను అడ్డుకునేందుకు కూటమి విజయం అనివార్యమని శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గొండు శంకర్‌ అన్నారు. ప్రచారంలో భాగంగా గురువారం నగరం లోని 28వ డివిజన్‌ దమ్మలవీధి, రూరల్‌ మండలం పొన్నాం, నవనంబాడు, బమ్మిడివానిపేట, గొల్లపేటల్లో ప్రజాగళం పేరుతో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి బాబు సూపర్‌ సిక్స్‌ పథకాలపై ప్రచారం చేపట్టారు. అనంతరం శంకర్‌ మాట్లాడుతూ జగన్‌రెడ్డి పాలనలో అవినీతి, అరాచకాలు తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. యువతకు ఉపాధి కల్పించడంలో జగన్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారన్నారు. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తే అన్ని వర్గాలకు అండగా నిలుస్తారన్నారు.

ప్రచారంలో గొండు శంకర్‌ సతీమణి

గార: శ్రీకాకుళం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌ సతీమణి స్వాతి గురువారం ఉదయం అంపోలు పంచాయతీ చల్లపేట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో తన భర్త శంకర్‌ను అత్యధిక మెజార్జీతో గెలిపించాలని కోరారు. సూపర్‌ సిక్స్‌ పథకాలపై వివరించారు.

అనుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం

శ్రీకాకుళం అర్బన్‌: శ్రీకాకుళం నియోజకవర్గం లో నాయకులు కార్యకర్త ల మనోభావాలు తెలుసు కోవడానికి పార్టీ అధిష్ఠా నం మరోసారి రహస్యం గా సర్వే చేస్తుండడం ఆనందంగా ఉందని, చంద్రబాబు తుదినిర్ణయం తమకు అనుకూలంగా వస్తుందని భావిస్తున్నట్టు మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుం డ లక్ష్మీదేవి అన్నారు. గురువారం అరసవిల్లిలోని వారి నివాసంలో గార మండల టీడీపీ ముఖ్య నాయకులతో గుండ దంపతులు సమావేశమయ్యారు. మరికొంత సమయం అవసరంగా భావిస్తున్నామన్నారు. కార్యక్రమంలో గార మండల టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 12:15 AM