Share News

నిధులు లేక..అనుమతిరాక

ABN , Publish Date - May 17 , 2024 | 12:00 AM

ప్రతిసారి జరిగే ఎన్నికలకు ఆరునెలల ముందు కొండలపైన ఉన్న గ్రామాలకు రహదారుల పనుల పేరుతో హడావుడి చేసి కొంతమేర పనులు చేసి పూర్తి బిల్లులు చేయించుకుని ఐదేళ్లు ముఖంచాటేస్తున్నారు. అయితే మెళియాపుట్టి మండలంలోని గిరిజన గ్రామాలకు రహదారులు దశా బ్దాలుగా పూర్తికావడంలేదు. ప్రధానంగా నిధులు లేకపోవడంతోపాటు, అటవీశాఖ నుంచి అనుమతి లేకపోవడంతో రోడ్ల పనులు పూర్తికావ డంలేదని ఐటీడీఏ అధికారులు చెబుతున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు, బంధువులకే పనులు అప్పగిస్తుండడంతో పూర్తి చేయకుండా అర్ధాంతరంగా నిలిపివేస్తున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. గత ఐదేళ్లుగా వైసీపీ నాయకులు హడావుడిచేసినా పనులు పూర్తిచేయలేదని విమర్శిస్తు న్నారు. కొండలపై గ్రామాలకు రహదారులు లేకపోవడంతో అనారోగ్యంతో బాధపడేవారికి డోలీలతో మోసి తీసుకువెళ్లాల్సి వస్తోంది. గతఏడాది గూడ గ్రామానికి చెందిన మహిళకు అర్ధరాత్రి పురిటి నొప్పులు రావడంతో ఎంతో కష్టపడి వైద్యసిబ్బంది కొండ కిందకి దించి ఆరోగ్యకేంద్రానికి తరలించారు. కేరాశింగి గ్రామానికి చెందిన ఓ మహిళ మార్గమధ్యలో ప్రసవమైన విషయం విదితమే. దీంతోపాటు రేషన్‌ సరుకులు సైతం కింద నుంచే మోసి తీసుకువెళ్లాల్సి వస్తోంది.

నిధులు లేక..అనుమతిరాక
అర్ధాంతరంగా నిలిచిన కేరాశింగి రహదారి పనులు:

(మెళియాపుట్టి)

ఇదీ పరిస్థితి..

మండలంలోని కేరాశింగి, గూడ, అడ్డివాడ, దబ్బగుడ్డి, చందనగిరి గిరిజన గ్రామాలకు రహదారులు లేకపోవడంతో గిరిజనులు అవస్థలకు గురవుతున్నారు. ఏడాది కిందట ఐటీడీఏ ఉపాధి నిధులు నుంచి చందనగిరికి రూ.1.25 కోట్లు, అడ్డివాడకు రూ.1.75 కోట్లు, కేరాశింగికి రూ.92 లక్షలు, గూడకు రూ. 1.5 కోట్లు నిధులు మంజూ రయ్యాయి. ఆయా గ్రామాలకు సిమెంట్‌ రహ దారి వేయాల్సిఉంది. అయితే సిప్స్‌వేసి పనులు నిలిపివేశారు. ఈమేరకు పనులకు సంబంఽధించి బిల్లులు సైతం అడ్వాన్స్‌ కింద చేయించుకు న్నట్లు విమర్శలువినిపిస్తున్నాయి. దీంతో మళ్లీ వర్షాలు కురిస్తే వేసిన రోడ్డుపై ఉన్న చిప్స్‌ కరిగిపోయి కొండ దిగువకు వచ్చే చేరుతుందని గిరిజనులు ఆందోళనచెందుతున్నారు. గతంలో ఐటీడీఏ పీవోగా ఉన్న కల్పనాకుమారి సైతం పరిశీలించి పనులు వేగవంతంచేశారు. అయితే కొంతమంది ఇంజినీరింగ్‌ అధికారుల అశ్రద్ధ వల్ల పనులు అర్ధాంతరంగా నిలిపివేసినట్లు విమర్శలొస్తున్నాయి. నిధులు రాకే పనులు చేయలేకపోతు న్నట్లు ఐటీడీఏ అధికారులు చెబుతున్నారు. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గిరిజనుల ఓట్లకోసం మళ్లీ వైసీపీ అధికారం లోకి వస్తేనే అర్ధాంతరంగా నిలిచిన రోడ్ల పనులు జరుగుతాయని మాయ మాటలు చెబు తున్నారని గిరిజన సంఘ, ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఐదేళ్లుగా చేయలేని వారు మళ్లీ అధికా రంలోకి వస్తే ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అత్యవసర సమయంలో రోగులు, గర్భిణులకు డోలీల్లో ఆస్పతులకు తరలిస్తున్నట్లు గిరిజనులు వాపోతున్నారు.

ఓట్లు వేసిన తర్వాత పనులు చేయడంలేదు..

ఎన్నికల ముందు పనులు మొదలైనట్లు చేసి ఓట్లు వేసిన తర్వాత రహదారి పనులు పూర్తి చేయడం లేదు. ఎమ్మెల్యే రెడ్డిశాంతి రహదారి పనులు పూర్తిచేసి ఓట్లకు వస్తామన్నారు. కాని ఎన్నికలు వచ్చినా రహదారి పనులు పూర్తికాలేదు. దీంతో స్థానిక వైసీపీ నాయ కులు మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

-సరవ రాము, కేరాశింగి, మెళియాపుట్టి మండలం

పనులు నిలిపివేశారు..

అదిగోఅదిగో అంటు ఎన్నికలు ముందు పనులు ప్రారంభించి అర్ధాం తరంగా నిలుపుదల చేశారు. వర్షాలు కురిస్తే రహదారిపై ఉన్న రాయి, మట్టి కొట్టుకుపోతున్నాయి. దీంతో మళ్లీ మొదటికే సమస్య వస్తుంది.

-ఎస్‌.సోమేష్‌, కేరాశింగి, మెళియాపుట్టి మండలం

బాధలు తప్పడం లేదు..

మాకు బాధలు తప్పడం లేదు. అనారోగ్యానికి గురైతే డోలీ కట్టి కిందకు దింపుతారు. అక్కడి నుంచి 108 వాహనాల ద్వారా ఆసుపత్రికి తీసుకు వెళ్తున్నారు. ఎన్నికల ముందే మేము గుర్తొస్తున్నాం.

-ఎస్‌.లక్ష్మిమ్మ, కేరాశింగి, మెళియాపుట్టి మండలం

Updated Date - May 17 , 2024 | 12:00 AM