రైతులకు అండగా ఉంటా
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:52 PM
రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. నారాయణపురం కుడికాలువలో పూడికతీత పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు.

ఎచ్చెర్ల: రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. నారాయణపురం కుడికాలువలో పూడికతీత పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. కాలువలో పూడికలు, గుర్రపు డెక్క ఉండడంతో శివారు భూములకు సాగునీరు అందడంలేదని కూటమి నేతలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కాలువ ద్వారా సాగునీరు సరఫరాకు అడ్డంకి లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను కోరారు. దీంతో శుక్రవారం పెయ్యలవానిపేట వద్ద కాలువలో గుర్రపుడెక్క తొలగింపు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ పూర్వపు మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాలం, టీడీపీ మండల అధ్యక్షుడు బెండు మల్లేశ్వర రావు, కూటమి నేతలు సంపతిరావు నాగేశ్వరరావు, వావిలపల్లి రామకృష్ణ, గాలి వెంకటరెడ్డి, గూరు జగపతిబాబు, నక్క లక్ష్మణరావు, పంచిరెడ్డి కృష్ణారావు, అన్నెపు భువనేశ్వరరావు, పైడి ముఖలింగం, మెండ రాజారావు, పైడి అన్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎచ్చెర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ శిక్షణా తరగతులను ఎమ్మెల్యే సందర్శించారు.