Share News

144 సెక్షన్‌ ఎందుకు విధిస్తారు

ABN , Publish Date - Apr 22 , 2024 | 11:48 PM

ఎన్నికలు, అల్లర్లు జరిగేటప్పుడు, పరీక్షల నిర్వహణ సమయంలో ఎక్కువగా 144 సెక్షన్‌ విధిస్తుంటారు. అసలు 144 సెక్షన్‌ అంటే ఏమిటి, ఎందుకు, ఎప్పుడు విధిస్తారో తెలుసుకుందాం. సీఆర్‌పీసీ 144 సెక్షన్‌ కింద ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ర్టేట్లకు విస్తృత అధికారాలు కల్పించారు. ప్రధానంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిన సమయలో పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఈ సెక్షన్‌ అమలు చేస్తారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా పోలింగ్‌ కేంద్రాల వద్ద దీనిని విధిస్తారు. ఈ సెక్షన్‌ అమలు లోకి వస్తే నలుగురు ఐదుగురు వ్యక్తులకు మించి గుమిగూడ కూడదు. కలిసి తిరగడంపై కూడా నిషేఽధాజ్ఞలు విధిస్తారు. ఎన్నికల సమయంలో నామినేషన్ల ప్రక్రియ నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేవరకు ఈ సెక్షన్‌ అమలులో ఉంటుంది. ఆ సమయంలో ప్రదర్శనలు, ఊరేగింపులు,ర్యాలీలు చేయరాదు. ప్రధానంగా రెండు పార్టీలు, గ్రూపుల మధ్య తగాదాలు తలెత్తినప్పుడు కూడా విధిస్తారు. రెండు నెలల వరకు కలెక్టర్‌, ప్రభుత్వం నియమించిన మేజిస్ర్టేట్‌ పోలీసు మాన్యువల్‌ ప్రకారం ఎస్పీలు ఈ సెక్షన్‌ను అమలు చేస్తారు.

144 సెక్షన్‌ ఎందుకు విధిస్తారు

హిరమండలం: ఎన్నికలు, అల్లర్లు జరిగేటప్పుడు, పరీక్షల నిర్వహణ సమయంలో ఎక్కువగా 144 సెక్షన్‌ విధిస్తుంటారు. అసలు 144 సెక్షన్‌ అంటే ఏమిటి, ఎందుకు, ఎప్పుడు విధిస్తారో తెలుసుకుందాం. సీఆర్‌పీసీ 144 సెక్షన్‌ కింద ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ర్టేట్లకు విస్తృత అధికారాలు కల్పించారు. ప్రధానంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిన సమయలో పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఈ సెక్షన్‌ అమలు చేస్తారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా పోలింగ్‌ కేంద్రాల వద్ద దీనిని విధిస్తారు. ఈ సెక్షన్‌ అమలు లోకి వస్తే నలుగురు ఐదుగురు వ్యక్తులకు మించి గుమిగూడ కూడదు. కలిసి తిరగడంపై కూడా నిషేఽధాజ్ఞలు విధిస్తారు. ఎన్నికల సమయంలో నామినేషన్ల ప్రక్రియ నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేవరకు ఈ సెక్షన్‌ అమలులో ఉంటుంది. ఆ సమయంలో ప్రదర్శనలు, ఊరేగింపులు,ర్యాలీలు చేయరాదు. ప్రధానంగా రెండు పార్టీలు, గ్రూపుల మధ్య తగాదాలు తలెత్తినప్పుడు కూడా విధిస్తారు. రెండు నెలల వరకు కలెక్టర్‌, ప్రభుత్వం నియమించిన మేజిస్ర్టేట్‌ పోలీసు మాన్యువల్‌ ప్రకారం ఎస్పీలు ఈ సెక్షన్‌ను అమలు చేస్తారు.

Updated Date - Apr 22 , 2024 | 11:48 PM