Share News

సిక్కోలు సింహాం ఎవరో?

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:39 AM

టీడీపీ అంటే సిక్కోలు.. సిక్కోలు అంటే టీడీపీ అనేలా శ్రీకాకుళం నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా మారింది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఆరుసార్లు టీడీపీ అభ్యర్థులు గెలుపుబావుటా ఎగురవేయడమే దీనికి నిదర్శనం. పార్టీ ఆవిర్భావం తరువాత వరుసగా ఐదుసార్లు టీడీపీ అభ్యర్థులకు పట్టం కట్టారంటే ప్రజల గుండెల్లో ఎంత నాటుకుపోయిందో అర్ధం చేసుకోవచ్చు. నియోజవర్గం ఏర్పడిన తరువాత కేవలం మూడుసార్లు మాత్రమే కాంగ్రెస్‌ గెలిచింది. ఒకసారి వైసీపీకి అధికారం ఇచ్చారు ప్రజలు. శ్రీకాకుళం టీడీపీ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది గుండ కుటుంబమే. ఆ కుటుంబాన్ని అంతలా ఆదరించారు ఇక్కడి ఓటర్లు. అయితే, ఈసారి మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా లక్ష్మీదేవికి బదులు యువనేత గొండు శంకర్‌కు టీడీపీ టికెట్‌ దక్కింది. దీంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైసీపీ అభ్యర్థి, మంత్రి ధర్మాన ప్రసాదరావును ఢీకొట్టబోతున్నారు. అమాత్యున్ని ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. చూడాలి మరి ప్రజలు ఎవరికి పట్టం కడతారో.

సిక్కోలు సింహాం ఎవరో?

టీడీపీ అంటే సిక్కోలు.. సిక్కోలు అంటే టీడీపీ అనేలా శ్రీకాకుళం నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా మారింది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఆరుసార్లు టీడీపీ అభ్యర్థులు గెలుపుబావుటా ఎగురవేయడమే దీనికి నిదర్శనం. పార్టీ ఆవిర్భావం తరువాత వరుసగా ఐదుసార్లు టీడీపీ అభ్యర్థులకు పట్టం కట్టారంటే ప్రజల గుండెల్లో ఎంత నాటుకుపోయిందో అర్ధం చేసుకోవచ్చు. నియోజవర్గం ఏర్పడిన తరువాత కేవలం మూడుసార్లు మాత్రమే కాంగ్రెస్‌ గెలిచింది. ఒకసారి వైసీపీకి అధికారం ఇచ్చారు ప్రజలు. శ్రీకాకుళం టీడీపీ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది గుండ కుటుంబమే. ఆ కుటుంబాన్ని అంతలా ఆదరించారు ఇక్కడి ఓటర్లు. అయితే, ఈసారి మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా లక్ష్మీదేవికి బదులు యువనేత గొండు శంకర్‌కు టీడీపీ టికెట్‌ దక్కింది. దీంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైసీపీ అభ్యర్థి, మంత్రి ధర్మాన ప్రసాదరావును ఢీకొట్టబోతున్నారు. అమాత్యున్ని ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. చూడాలి మరి ప్రజలు ఎవరికి పట్టం కడతారో.

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇప్పటివరకు ఆరుసార్లు టీడీపీ జెండా ఎగిరింది. పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో కేవలం మూడుసార్లు మాత్రమే టీడీపీయేతర పార్టీ లు విజయం సాధించాయి. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 15 సార్లు ఎన్నికలు జరగ్గా కేవలం మూడుసార్లు మాత్రమే ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ గెలుపొందింది. ప్రజలు ఆది నుంచి కాంగ్రెస్సేతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు పట్టంకడుతు న్నారు. టీడీపీకి సంప్రదాయ ఓటు, పార్టీ విధానాలపై ఆకర్షి తులైన ఓటర్లు ఉండడంతో ఆవిర్భావం నుంచి కంచుకోటగా మారింది. వరుసగా ఐదుసార్లు టీడీపీ అభ్యర్థులను గెలిపించారు. ఈసారి జరిగే ఎన్నికల్లో శ్రీకాకుళం ఓటర్లు టీడీపీని గెలిపించి సంప్రదాయం కొనసాగిస్తారని విభిన్న వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ నియోజకవర్గం పరిధి..

శ్రీకాకుళం నగరపాలకసంస్థ, రూరల్‌, గార మండలా లు కలిపి 1952లో నియోజకవర్గంగా ఏర్పాటుచేశారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో శ్రీకాకుళం ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. ఆ నియోజకవర్గానికి మొద టి శాసనసభ్యులుగా కావలి నారాయణ, కిల్లి అప్పల నాయుడు వ్యవహరించారు. తర్వాత కాలంలో దేశ వ్యాప్తంగా ద్విసభ్య నియోజకవర్గాలను రద్దు చేయ డంతో ఇక్కడ కూడా ఒకే నియోజకవర్గంగా మారింది. ఇక్కడ గార, శ్రీకాకుళం రూరల్‌ మండలాల్లో వెలమ సామాజికవర్గం ఎక్కువగా ఉన్నా, నగర పరిధిలో విభిన్న సామాజిక వర్గాలు ఉంటున్నాయి.

మహిళా ఓటర్లే కీలకం..

నియోజకవర్గం పరిధిలోని శ్రీకాకుళం అర్బన్‌లో 1,17,320 మంది, రూరల్‌లో 69,812 మంది, గార మండలంలో 75,017 మంది కలిపి మొత్తం 2,62,149 మంది జనాభా నివసిస్తోంది. ఇందులో ఎస్సీలు 19,438 కాగా ఎస్టీలు 1,009 మంది మాత్రమే ఉన్నారు. నియోజకవర్గం పరిధిలో మొత్తం 2,71,079 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,34,177 మంది పురుషులు, 1,36,871 మంది మహిళలు, 31 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. పురుషుల కంటే 1694 ఓటర్లు మహిళలే అధికంగా ఉన్నారు. దీంతో వారే అభ్యర్థుల గెలుపులో కీలకం కానున్నారు. అలాగే శ్రీకాకుళం అర్బన్‌లో 139, రూరల్‌ మండలంలో 66, గార మండలంలో 75 కలిపి మొత్తం 279 పోలింగ్‌ కేంద్రాలు ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గంలో 97 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను అధికారులు గుర్తించారు.

‘గుండ’ కుటుంబానికే ప్రాధాన్యం..

నియోజకవర్గం 1952లో ఏర్పడిన తర్వాత ఎక్కువ కాంగ్రెస్సే తర పార్టీలకే ఇక్కడి ఓటర్లు పట్టం కట్టారు. 1983లో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా మారిపోయింది. 1983లో టీడీపీ తరఫున తంగి సత్యనారాయణ గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా నాలుగుసార్లు 1985, 1989, 1994, 1999లో గుండ అప్పలసూర్యనారాయణ విజయం సాధించారు. 2014లో టీడీపీ తరఫున అప్పలసూర్యనారాయణ సతీమణి లక్ష్మీదేవి విజయం సాధించారు. దీంతో గుండ కుటుంబానికి ఐదుసార్లు ప్రజలు పట్టంకట్టినట్లు అయింది. అప్పటివరకూ నరసన్నపేటలో పోటీ చేస్తున్న ధర్మాన ప్రసాదరావు అక్కడ తన సోదరుడు కృష్ణదాసును బరిలో దింపి ఆయన శ్రీకాకుళంలో పోటీచేశారు. ప్రసాదరావు 2004-14 వరకు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలు పొందారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్‌లో కీలకమైన రెవెన్యూశాఖను నిర్వహించారు. 2014లో లక్ష్మీదేవి చేతిలో ధర్మాన ఓటమి పాలయ్యారు. తిరిగి 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీఎం జగన్‌ సారథ్యంలో రెండో క్యాబినెట్‌ విస్తరణలో భాగంగా రెవెన్యూశాఖను ధర్మానకు అప్పగించారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న గుండ లక్ష్మీదేవిని కాదని సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గొండు శంకర్‌కు టీడీపీ అధిష్ఠానం టికెట్‌ ఖరారు చేసింది. వైసీపీ తరఫున మంత్రి ధర్మాన ప్రసాదరావు పోటీపడనున్నారు.

వైసీపీ పాలనపై విసిగిన ప్రజలు..

ధర్మాన ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎంతో కీలకమైన పనులను పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డు విస్తరణ, కోడిరామ్మూర్తి స్టేడియం, ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ భవనం తదితర పనులను గాలికొదిలేసింది. అధికారం చేపట్టి ఐదేళ్లవుతున్నా పనులను పూర్తిచేయకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. కనీసం శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డు బాగు చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవన్నీ వైసీపీకి ప్రతికూలంగా మారాయి. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పే అవకాశం ఉంది.

కులాల వారీగా

ఓటర్ల వివరాలు..

కులం ఓటర్లు

వెలమలు 38,796

కాపు/తెలగ, ఒంటరి 6,137

కళింగ 12,231

ఎస్సీ 15,800

బెస్త/పల్లి/గండ్ల 11,571

యాదవలు 10446

ఎస్టీ 931

వైశ్యులు 11,955

బలిజలు 6,824

శ్రీశయన 8,955

ఒడ్డెర 1,709

రజక 3,934

దేవాంగ 3,219

ఇతరులు 29,194

ఇప్పటివరకు శ్రీకాకుళం శాసనసభ సభ్యులు

సంవత్సరం సభ్యుడు రాజకీయ పార్టీ

1952 కావలి నారాయణ కేఎల్‌పీ

1952 కిల్లి అప్పలనాయుడు కృషికర్‌ లోక్‌పార్టీ

1955 పసగడ సూర్యనారాయణ ఇండిపెండెంట్‌

1962 అంధవరపు తవిటియ్య కాంగ్రెస్‌

1967 తంగి సత్యనారాయణ స్వతంత్ర పార్టీ

1972 చల్లా లక్ష్మీనారాయణ స్వతంత్ర

1978 చల్లా లక్ష్మీనారాయణ జనతా పార్టీ

1983 తంగి సత్యనారాయణ టీడీపీ

1985 గుండ అప్పలసూర్యనారాయణ టీడీపీ

1989 గుండ అప్పలసూర్యనారాయణ టీడీపీ

1994 గుండ అప్పలసూర్యనారాయణ టీడీపీ

1999 గుండ అప్పలసూర్యనారాయణ టీడీపీ

2004 ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్‌

2009 ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్‌

2014 గుండ లక్ష్మీదేవి టీడీపీ

2019 ధర్మాన ప్రసాదరావు వైసీపీ

Updated Date - Apr 25 , 2024 | 12:39 AM