Share News

సొంత చెల్లెళ్లను పట్టించుకోని జగన్‌రెడ్డి రాష్ట్రానికి ఏమి ఉద్ధరిస్తాడు

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:11 AM

సొంత చెల్లెళ్లను పట్టించుకోని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని ఏమి ఉద్దరిస్తాడని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షు డు కూన రవికుమార్‌ ఎద్దేవా చేశారు.

సొంత చెల్లెళ్లను పట్టించుకోని జగన్‌రెడ్డి రాష్ట్రానికి ఏమి ఉద్ధరిస్తాడు
మాట్లాడుతున్న రామ్మోహన్‌నాయుడు, రవికుమార్‌

- ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

పొందూరు: సొంత చెల్లెళ్లను పట్టించుకోని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని ఏమి ఉద్దరిస్తాడని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షు డు కూన రవికుమార్‌ ఎద్దేవా చేశారు. మండల కేంద్రంలో జరిగిన శుభ కార్య క్రమాల్లో వారు పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జగన్‌రెడ్డి నో రు విప్పితే నా అక్క, చెల్లమ్మలు అని అంటారు కాని సొంత కుటుంబసభ్యులనే రోడ్డున పడేసిన ఘనుడని అన్నారు. తన తండ్రి హత్యకేసుపై మాట్లాడిన చెల్లెలు సునీత, జగన్‌ విడిచిన బాణమని చెప్పుకున్న వైఎస్‌ షర్మిళ జగన్‌రెడ్డిని విమర్శించి, నిలదీస్తే సమాధానం ఇవ్వలేని వ్యక్తి జగన్‌ రెడ్డని విమర్శించారు. సొంత చెల్ల్లెళ్లలే నమ్మని జగన్‌రెడ్డిని రాష్ట్రంలో ఏ మహిళ నమ్ముతుందన్నారు. జగన్‌రెడ్డి మాయ మాటలు నమ్మేస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. పార్టీ నాయకులు సీహెచ్‌ రామ్మో హన్‌, బి.శంకర భాస్కర్‌, అనకాపల్లి విజయలక్ష్మి, ఎ.శ్రీనివాసరావు, ఎ.చినరంగ, బాడాన గిరి, ఎ.వాణి, బి.హారిక, ఎస్‌.శ్రీరంగ, ఎ.గోపి, తదితరులు ఉన్నారు.

జగన్‌కు ఓటమి భయం

- విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల టీడీపీ కోఆర్డినేటర్‌ పీఎస్‌రెడ్డి

సరుబుజ్జిలి: సార్వ త్రిక ఎన్నికల్లో టీడీపీ, బీ జేపీ, జనసేన కూటమితో సైకో సీఎం జగన్మోహన్‌ రెడ్డికి ఓటమి భయం పటు ్టకుందని టీడీపీ విజయన గరం, శ్రీకా కుళం జిల్లాల కోఆర్డినేటర్‌ పి.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం మం డలంలోని షలంత్రిలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికు మార్‌ శంఖారావం ఇంటింటి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీనివాస్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిన్నటి వరకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వైనాట్‌ 175 అన్న జగన్‌ రెడ్డి ఎన్‌డీఏ కూటమి దెబ్బకు తాడేపల్లి ప్యాలెస్‌ వదిలి బస్సు యాత్రతో ప్రజలను మభ్యపెట్టడానికి బయలుదేరారన్నారు. కార్యక్రమంలో బీజేపీ, జనసేన కన్వీనర్లు పేడాడ సూరపునాయుడు, పేడాడ రామ్మోహన్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శివ్వాల సూర్యనారాయణ, నాయకులు కిల్లి సిద్దార్థ, లావేటి పూర్ణారావు, నందివాడ గోవిందరావు, తాడేల రాజారావు తదితరులు పాలొన్నారు.

దుర్మార్గ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిద్దాం

గార: దుర్మార్గ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించేందుకు ప్రతి ఒక్కరూ సహకరిం చాలని శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గొండు శంకర్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఉదయం కళింగపట్నంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లా డారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని, ప్రధానిగా నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారంలోకి రావడం ఖాయమన్నారు. టీడీపీ నాయకులు పీస వెంకటరమణ మూర్తి, బడగల వెంకట అప్పారావు, తాళ్లూరి శివనర్సింహ ప్రసాద్‌, గొండు భాస్కర్‌. ఈజీవీ రమణమూర్తి, కె.జగదీష్‌, కె.శ్రీధర్‌ రెడ్డి, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

చంద్రబాబు బీసీల పక్షపాతి

అరసవల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు బీసీల పక్షపాతి అని శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గొండు శంకర్‌ అన్నారు. బుధవారం నగరంలోని ఓ హోటల్‌లో బీసీల ఆత్మీక కలయిక నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్‌ మా ట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వస్తే బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్‌ అందిస్తామ న్నారు. తాను ఓ సామాన్య కార్యకర్తనని, పార్టీ పట్ల తనకు గల చిత్తశుద్ధి, ప్రజా సమస్యలపై పోరాడే తీరును చూసి తనకు ఈ అవకాశం ఇచ్చారన్నారు. నీలి మీడియా తప్పుడు ప్రచారం చేసి టీడీపీ కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తోందన్నారు. ఇటువంటి రాతలను నమ్మవద్దని టీడీపీ నాయకులను, కార్యకర్తలను అభిమానులను కోరారు. ఈ సందర్భంగా బీసీ డిక్లరేషన్‌లోని 10 అంశాలను ఆయన వివరించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పార్టీకి నష్టం వాటిల్లకుండా మాట్లాడాలి

అరసవల్లి: పార్టీ అధిష్ఠానం నిర్ణయం తెలియజేసేంత వరకు సంయమనం పాటించాలని, పార్టీకి నష్టం వాటిళ్లకుండా ప్రవర్తించాలని శ్రీకాకుళం నియోజ కవర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలను విజ్ఞప్తి చేశారు. అరసవల్లిలో గల మాజీ మంత్రి గుండ దంపతులు నివాసంలో బుధవారం వారు సమావేశమై మాట్లాడారు. టీడీపీ శ్రీకాకుళం నియోజకవర్గ అభ్యర్థి విషయంలో మళ్లీ ఐవీఆర్‌ఎస్‌ సర్వే చేయడం కూన రవికుమార్‌ చొరవతో జరిగిందని, ఈ విషయంలో మిగతా చర్యలు కూడా పూర్తి చేస్తే నియోజకవర్గ నాయకులు, ప్రజలు సంతోషపడతారన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 12:11 AM