Share News

రోడ్డే వేయనోళ్లు ఇంకేం చేస్తారు?

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:28 AM

శ్రీకాకుళం- ఆమదాలవలస రోడ్డును ఇటు మంత్రి ధర్మాన ప్రసాదరావు, అటు స్పీకర్‌ తమ్మి నేని సీతారాం వేయలేక పోయా రని, ఐదేళ్లలో 15 కిలోమీటర్ల రోడ్డును పూర్తిచేయలేని వారు ప్రజలకు ఇంకేం చేస్తారని శ్రీకా కుళం ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించారు.

రోడ్డే వేయనోళ్లు ఇంకేం చేస్తారు?
మహిళలకు అభివాదం చేస్తున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు

- ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎంతో నష్టపోయాం

- రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు రావాలి

- శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌నాయుడు

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

శ్రీకాకుళం- ఆమదాలవలస రోడ్డును ఇటు మంత్రి ధర్మాన ప్రసాదరావు, అటు స్పీకర్‌ తమ్మి నేని సీతారాం వేయలేక పోయా రని, ఐదేళ్లలో 15 కిలోమీటర్ల రోడ్డును పూర్తిచేయలేని వారు ప్రజలకు ఇంకేం చేస్తారని శ్రీకా కుళం ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించారు. బుధవారం శ్రీకాకుళంలోని ఎన్టీఆర్‌ మునిసిపల్‌ హైస్కూల్‌ మైదానంలో జిల్లా మహిళలతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి రామ్మోహన్‌ పాల్గొని మాట్లాడారు. మరో నలభైరోజుల్లో ఆంధ్రాకు కాబోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని తెలిపారు. ఐదేళ్ల కాలంలో అత్యధికంగా నష్టపోయింది మహిళలేనని చెప్పారు. పేదలకోసం 40 ఏళ్లుగా టీడీపీ పనిచేస్తోందని తెలిపారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కును కల్పించింది ఎన్టీఆర్‌ అని, డ్వాక్రా సంఘాలు పెట్టించి మహిళా సంఘాలకు ఎంతగానో ఆర్థికసహాయం అందించిన ఘనత చంద్రబాబుదేనని తెలిపారు. సంక్రాంతికి ప్రతి ఇంటికీ కానుకలు పంపించేవారని, పసుపు-కుంకుమతో మహిళలందరికీ సహాయం అందించేవారని చెప్పారు. జగన్‌లా మోసం చేయలేదని తెలిపారు. చంద్రబాబు శ్రీకాకుళంలో మూడు వేలు టిడ్కో ఇళ్లు కట్టించారని, వైసీపీ వచ్చిన తర్వాత లబ్ధిదారులకు ఇళ్లు, చెల్లించిన డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు. మహిళలకు మంచి జరగాలన్నా, రాష్ట్ర బాగుపడాలన్నా చంద్రబాబు మళ్లీ సీఎం కావాలన్నారు. త్రిమూర్తులుగా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, నరేంద్రమోదీ ప్రజలను అన్నివిధాలా ఆదుకుం టారని తెలిపారు. మే 13న జరిగే ఎన్నికలకు ధైర్యంగా ప్రజలు ముందుకువచ్చి ఓట్లు వేయాలని కోరారు.

జగన్‌ మాటలేమయ్యాయి: రవికుమార్‌

‘టీడీపీ హయాంలో ఉపాధిహామీ పనులకు వెళ్లినవారికి తాగునీటి కోసం రూ.10 చొప్పున ఇచ్చేవారు. ఇప్పుడు జగన్‌రెడ్డి అవన్నీ తీసేసి.. బటన్‌నొక్కి మనవద్ద నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు’అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఆరోపించారు. జగన్మోహన్‌రెడ్డివి అన్నీ అసత్యా లేనని తెలిపారు. అమ్మఒడి రూ.15వేలు అని చెప్పి ఓ ఏడాది రూ. 14వేలు.. మిగిలిన మూడేళ్లు రూ.13వేలు చొప్పున ఇచ్చాడన్నారు. జగన్‌ ఆఖరి ఏడాది ఎగ్గొట్టాడని తెలిపారు. మద్యం లేకుండా చేసి ఓటు అడుగుతామని చెప్పిన జగన్‌.. ఇప్పుడు ఆ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మహిళలూ మీరే చెప్పండి ప్రతిగ్రామంలో మద్యం దొరుకుతుందా లేదా అని అడిగారు. నిత్యావసరాల ధరలు పెంచేశారని, చెత్త, నీటిపన్నులు, కరెంట్‌ చార్జీలు పెంచేశాడ న్నారు. సంక్షేమం అన్ని కుటుంబాలకు అందాలన్నదే టీడీపీ ధ్యేయమని తెలిపారు. కూన రవి కుమార్‌ను చంద్రబాబు దుశ్శాలువతో సత్కరించారు. టీడీపీ జిల్లా అధ్యక్ష పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నానని.. తన పదవిని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు ఇవ్వాలని ఆయన కోరారు. దీంతో అందరూ అంగీకరించారు. అనంతరం రవికుమార్‌ను చంద్రబాబు సత్కరించారు.

చంద్రబాబు స్ఫూర్తితో అన్న క్యాంటీన్‌ నిర్వహించా: గొండు శంకర్‌

చంద్రబాబునాయుడి స్ఫూర్తితో శ్రీకాకుళం నగరంలో అన్నక్యాంటీన్‌ను ఏడాది పాటు నిర్వహించి 1.50లక్షల మందికి భోజనం పెట్టానని శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గొండు శంకర్‌ తెలిపారు. వైసీపీ నాయకు లు మాయమాటలు చెబుతున్నారని ఆరోపించారు. అర్హులకు పెన్షన్లు ఇవ్వడంలేదన్నారు. నియోజకవర్గ ప్రజలకోసం పారిశ్రామిక హబ్‌ కావాలని, మత్స్యకారుల కోసం జెట్టీ నిర్మించాలని కోరారు. టీడీపీ హయాం లో చేపట్టిన టిడ్కో ఇళ్లను వైసీపీ పూర్తిచేయలేదని ఆరోపించారు. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా రామ్మోహన్‌నాయుడిని గెలిపించాలని కోరారు. అందరం కలిసి చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు.

Updated Date - Apr 25 , 2024 | 12:28 AM