Share News

అసలు ఏం జరిగింది?

ABN , Publish Date - May 23 , 2024 | 12:29 AM

నరసన్నపేటలోని ఓ బ్యాంకులో రుణాల మంజూరు వ్యవహారం లో నిజాలు బయటకు పొక్కనీయకుండా సంబంధింత అధికారులు గోప్యత పాటిస్తున్నారు.

అసలు ఏం జరిగింది?

- రుణాల వ్యవహారంలో బ్యాంకు సిబ్బంది గోప్యత

- మూడు రోజుల కిందట కొత్త బీఎం నియామకం

నరసన్నపేట, మే 22: నరసన్నపేటలోని ఓ బ్యాంకులో రుణాల మంజూరు వ్యవహారం లో నిజాలు బయటకు పొక్కనీయకుండా సంబంధింత అధికారులు గోప్యత పాటిస్తున్నారు. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్‌ఎంవోను గత నెలలో బదిలీ చేశారు. బ్రాంచ్‌ మేనే జర్‌ను రీజనల్‌ కార్యాలయం డిప్యూట్‌ చేసి.. ఆయన స్థానంలో వీరఘట్టం బ్యాంకులో పని చేస్తున్న బీఎంను మూడురోజుల కిందట ఇక్కడ నియమించారు. అయితే ఏం జరిగిందన్న విషయాన్ని బయటపెట్టకపోవడం చర్చనీయాంశమవుతోంది. నరసన్నపేటలోని బ్యాంకులో ఏడాదిన్నర కిందట ఉద్యోగులు వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమ యంలో కొందరి డాక్యుమెంట్లు ఆధారంగా బ్యాంకు సిబ్బందే బినామీ ఖాతాలు తెరిచి.. రుణా లను పొందినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై గత నెలలో పత్రికల్లో కథనాలు వచ్చాయి. గతంలో పనిచేసిన ఓ అధికారి ఈ తతంగమంతా నడిపించినట్టు శాఖాపరంగా గుర్తించిన బ్యాంకు ఉన్నతాధికారులు ఆయనను వేరుజిల్లాకు బదిలీ చేశారని తెలుస్తోంది. అలాగే రుణా ల మంజూరు వ్యవహారంపై గత నెలలో దర్యాప్తు చేసిన విజిలెన్స్‌ నివేదిక బయటకు పొక్క కుండా చేస్తున్నారు. రుణాల వ్యవహారంలో పాత మేనేజర్‌ను పావుగా వాడుకుని.. కొంతమేర డబ్బులు పక్కదారి పట్టాయని గుర్తించినట్లు సమాచారం. కాగా బాధ్యతా రాహిత్యంగా వ్యవ హరించిన వారిని పక్కన పెట్టారని.. అయితే సాధారణ బదిలీలు మాత్రమేనని అధికారులు చెప్పుకొస్తుండడం గమనార్హం. బ్యాంకులో పెద్ద ఎత్తున అవకతవకలు జరగడంతోనే.. కొంత మంది అధికారులను బదిలీల పేరుతో పంపిస్తున్నారనేది చర్చనీయాంశమవుతోంది. ఖాతాదా రులకు నష్టం వాటిల్లకుండా.. బినామీ పేర్లతోనే రుణాల మంజూరు జరగడంతో.. బ్యాంకు ఉన్నతాధికారులు శాఖాపరంగా చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది.

Updated Date - May 23 , 2024 | 12:29 AM