రైతులను ఆదుకుంటాం
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:05 AM
వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటా మని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందా ళం అశోక్ అన్నారు.

- ఎమ్మెల్యే బెందాళం అశోక్
కవిటి, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటా మని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందా ళం అశోక్ అన్నారు. కవిటిలో నీట మునిగిన వరి చేలను ఆయన శనివా రం పరిశీలించారు. అల్పపీడనం కార ణంగా కురిసిన వర్షాల తో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలిందన్నారు. నియోజ కవర్గంలోని అన్ని మండలాల వ్యవసాయాధికారులతో చర్చించి పంట నష్టం అంచనా వేయాలని కోరామన్నారు. వ్యవసాయశాఖ మంత్రి, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ధాన్యం రంగుమారినా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఉప్పు ద్రావణాన్ని పిచికారి చేయాలి
జి.సిగడాం/రణస్థలం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఆనందపురం గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి త్రి నాథస్వామి పర్యటించారు. వర్షానికి తడిసిన వరి పన లు మొలకెత్తకుండా ఉండేందుకు 5 శాతం ఉప్పు ద్రావ ణాన్ని పిచికారి చేయాలని సూచించారు. ఆయన వెం ట ఏవో ఎర్రా శారద, వీఏఏ ముంతా హేమంత్‌కు మార్, సర్పంచ్ చిత్తిరి మోహన్, రైతులు ఉన్నారు. అ లాగే, జాడ, జగన్నాథవలస, బాతువ తదితర గ్రామా ల్లో తహసీల్దార్ ఎం.శ్రీకాంత్, ఏవో శారద పర్యటించా రు. రైతులతో మాట్లాడి పంట రక్షణ కోసం తీసుకోవా ల్సిన జాగ్రత్తలను వివరించారు.
- రణస్థలం మండలంలోని కమ్మసిగడాం, వేల్పురాయి, కొండములగాం గ్రామాల్లో జిల్లా వ్యవసాయ అధికారి త్రినాథస్వామి పర్యటించారు. రైతులకు సూచనలు చేశారు. శాస్త్రవేత్త ఉదయబాబు, ఏవో విజయభాస్కర్, రైతులు పాల్గొన్నారు.
ఎండబెట్టి నూర్చుకోవాలి
ఇచ్ఛాపురం, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): బూర్జపా డు, బెల్లుపడ, ఽధర్మపురం గ్రామాల్లో నేలకొరిగిన వరి చేలను వ్యవసాయ సహాయ సంచాలకుడు కె.జగన్మో హన్‌రావు, వ్యవసాయాధికారిణి టి.భార్గవి శనివారం పరిశీలించారు. పొలంలో నీరు నిలిచి ఉంటే పనలను గట్లపైకి తెచ్చుకొని విడగొట్టి ఉప్పు ద్రావణం చల్లుకోవా లని తెలిపారు. ఎండ రాగానే వనలను తిరగేసి ఎండ బెట్టి నూర్చుకోవాలని సూచించారు.