Share News

అండగా ఉంటాం.. ఆదుకుంటాం

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:54 AM

‘అధైర్యపడొద్దు. అండగా ఉంటాం. అన్ని విధాలా ఆదుకుంటాం’ అని మృతుల కుటుంబాలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీ మణి భువనేశ్వరి భరోసా ఇచ్చారు. కొన్నాళ్ల కిందట స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసు లో చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపం చెంది జిల్లాలో ఐదుగురు టీడీ పీ కార్యకర్తలు మృతి చెందారు.

అండగా ఉంటాం.. ఆదుకుంటాం
దవళపేటలో అసిరినాయుడు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న భువనేశ్వరి

- మృతుల కుటుంబాలకు నారా భువనేశ్వరి భరోసా

- ‘నిజం గెలవాలి’ పేరిట పరామర్శ

- బాధితులకు రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం

- అడుగడుగునా పార్టీ శ్రేణులు, అభిమానుల నీరాజనం

(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి/ఆమదాలవలస/జి.సిగడాం/బూర్జ)

‘అధైర్యపడొద్దు. అండగా ఉంటాం. అన్ని విధాలా ఆదుకుంటాం’ అని మృతుల కుటుంబాలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీ మణి భువనేశ్వరి భరోసా ఇచ్చారు. కొన్నాళ్ల కిందట స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసు లో చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపం చెంది జిల్లాలో ఐదుగురు టీడీ పీ కార్యకర్తలు మృతి చెందారు. బూర్జ మండలం తోటవాడలో గతేడాది సెప్టెంబరు 9న గేదెల సాంబమూర్తి, ఆమదాలవలస మండలం పాతనిమ్మ తర్లాడలో గొండు ఎర్రయ్య, సెప్టెంబరు 11న ఆకేటి పారయ్య, దన్నా నపేటలో గొర్లె తిరుపతిరావు, జి.సిగడాం మండలం దవళపేటలో గతే డాది అక్టోబరు 4న కంచరాన అసిరినాయుడు తీవ్ర కలత చెంది ప్రాణాలు కోల్పోయారు. ‘నిజం గెలవాలి’ పేరిట ఆయా మృతుల కుటుంబసభ్యులను భువనేశ్వరి గురువారం పరామర్శించారు. ఆర్థికసాయంగా ఒక్కో కుటుంబానికి రూ.3లక్షలు చొప్పున చెక్కులు అంద జేశారు. ఎల్లప్పుడూ పార్టీ తరపున అండగా నిలుస్తామని భరోసా కల్పించారు.

- ముందుగా.. జి.సిగడాం మండలం దవళపేటకు చెందిన మాజీ సైనికుడు కంచరాన అసిరినాయుడు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి ఓదార్చారు. మృతుడి భార్య అరుణకుమారి, కుమారులు అఖిల్‌, అభిషేక్‌తో కాసేపు మాట్లాడారు. ఎప్పుడూ అండగా ఉంటామని, అధైర్యపడొద్దని మనోధై ర్యాన్ని కల్పించారు. అసిరినాయుడు పేరున గ్రామంలో గ్రంథాలయాన్ని నిర్మిస్తే పలువురి ఉన్నత విద్యకు దోహదపడుతుందని మృతుడి సోదరుడు సూరన్నాయుడు భువనేశ్వరి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. పార్టీ తరపున సహాయసహకారాలు అందిస్తామని తెలిపారు.

- అనంతరం సాయంత్రం 5.30 గంటలకు బూర్జ మండలం తోటవాడ గ్రామానికి చేరుకున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్‌, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పార్టీ శ్రేణులతో కలిసి గేదెల సాంబమూర్తి కుటుంబాన్ని పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. తర్వాత ఆమదాలవలస మండలం నిమ్మతర్లాడ, దన్నానపేట గ్రామాల్లో పర్యటించి గొండు ఎర్రయ్య, ఆకేటి పారయ్య, గొర్లె తిరుపతిరావు కుటుంబాలను పరామర్శించారు. టీడీపీ ప్రజలకోసమే అని.. ఇటు కార్యకర్తల సంక్షేమం కూడా మరిచిపోదని.. అందరూ ధైర్యంగా ఉండాలంటూ భరోసా ఇచ్చారు. ప్రతిఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ‘నిజం గెలవాలి’ యాత్ర ముగించారు. అనంతరం విశాఖపట్నం పయన మయ్యారు.

- ఇదిలా ఉండగా భువనేశ్వరికి పర్యటించిన ప్రతిచోటా టీడీపీ శ్రేణులు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా జేజేలు కొడుతూ.. అడుగడుగునా నీరాజనం పలికారు. ‘జై బాబు.. జై జై చంద్ర బాబు’ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వి.అనిత, ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ, మాజీ ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి, కిమిడి కళావెంకటరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, విజయ నగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, మాజీఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌, జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు గొండు శంకర్‌, మామిడి గోవిందరావు, అలాగే జనసేన నాయకులు పేడాడ రామ్మోహనరావు, అన్ని మండలాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 12:54 AM