పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పిస్తాం: గొండు శంకర్
ABN , Publish Date - Nov 28 , 2024 | 11:59 PM
పెద్ద పాడులో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గురువారం పెద్దపాడులో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.

అరసవల్లి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): పెద్ద పాడులో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గురువారం పెద్దపాడులో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్ర మంలో మున్సిపల్ హెల్త్ అధికారి సుధీర్‌కుమార్ పాల్గొన్నారు. ఫ అలాగే సింగుపురంలో గురువా రం ఎమ్మెల్యే గొండు శంకర్ రైతు భరోసా కేంద్రా న్ని ప్రారంభించారు.
ఫ గార, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకూర్మంలోని మండల సమాఖ్య ఆఽధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.