Share News

ఉద్యోగాలిస్తాం..

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:17 AM

ఈ ఎన్నికల్లో వైసీపీ మూలపేట పోర్టును రాజకీయంగా వాడు కుంటుంది. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాంతీయులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆ పార్టీ నాయకులు గ్రామాల్లో జరుగుతున్న ప్రచారాల్లో ఢంకా కొడుతున్నారు. అయితే మూలపేట పరిధిలో భూములు దారపోసిన రైతులకు, ఆ గ్రామ యువతకు కనీసం ఇప్పటివరకు జరగని న్యాయం, ఇప్పుడు ఎన్నికల వేళ ఏమి చేస్తారులే అంటూ అధికార పార్టీకి చెందిన నాయకులే కొందరు పెదవి విరుస్తున్నారు. ఎన్నికలకు కొద్దిరోజులు సమయం ఉండగా ఎమ్మెల్సీ, టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ తన అనుచరగణంతో పోర్టు అభివృద్ధి పరిశీలన పేరిట పర్యటనలు చేస్తూ ఈ ప్రాంత ప్రజానీకానికి నమ్మబలికే ప్రయత్నాలు చేస్తున్నారని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు గుసగుసలాడుతున్నారు. వైసీపీ నాయకుల మాయమాటలు నమ్మవద్దని, అవన్నీ అబద్ధాలేనని ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు పలు సమావేశాల్లో వెల్లడించారు. పోర్టును పార్టీ ఎన్నికల కార్యాలయంలా వాడుకుంటున్నారని, జెండా, అజెండాలకు అక్కడ నుంచే అధికార పార్టీ కార్యాచరణ ప్రణాళిక చేస్తుందని ఎంపీ రామ్మోహన్‌నాయుడు సైతం ఆరోపించారు. పోర్టులో కేజీఎఫ్‌ తరహా సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆయన అన్నారు. అయితే వైసీపీ మాత్రం పోర్టును ఎలాగైనా ఎన్నికల్లో వాడుకోవాలని చేయని ప్రయత్నాలంటూ లేవు. వారి బూటకపు మాటలు నమ్మవద్దంటూ టీడీపీ నాయకులు సైతం బదులిస్తున్నారు. కేవలం ఎన్నికల్లో ప్రచారం కోసం అధికార పార్టీ పోర్టును వాడుకుంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఉద్యోగాలిస్తాం..

ఉద్యోగాలిస్తాం!

మూలపేట పోర్టులో దువ్వాడ ప్రలోభాలు

(టెక్కలి)

Updated Date - Apr 18 , 2024 | 12:17 AM