Share News

మేమంతా ‘కింజరాపు’ వెంటే

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:08 AM

‘పగలు, ప్రతీకారాలతో నిండివున్న వైసీపీలో మేము ఉండలేం. ప్రజలకు దగ్గరగా ఉంటూ సేవచేసే కింజరాపు కుటుంబం వెంటే నడుస్తాం’ అని టెక్కలి నియోజకవర్గంలోని పలు కుటుంబాలు తెలిపాయి.

మేమంతా ‘కింజరాపు’ వెంటే
టెక్కలి మండలం మేఘవరం నుంచి టీడీపీలో చేరిన 50 కుటుంబాలు

- వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 175 కుటుంబాలు

- ఆహ్వానించిన అచ్చెన్నాయుడు

టెక్కలి, మార్చి 21: ‘పగలు, ప్రతీకారాలతో నిండివున్న వైసీపీలో మేము ఉండలేం. ప్రజలకు దగ్గరగా ఉంటూ సేవచేసే కింజరాపు కుటుంబం వెంటే నడుస్తాం’ అని టెక్కలి నియోజకవర్గంలోని పలు కుటుంబాలు తెలిపాయి. ఈ మేరకు గురువారం 175 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వీరందరికీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. టెక్కలి మండలం మేఘవరం పంచాయతీకి చెందిన ఏదూరు శంకరరెడ్డి, నందిగాం కర్రెన్న, దల్లి ఎర్రయ్య, జలుమూరు ధనుంజయ, నాగరాజు, ముద్దాడ కృష్ణ, జలుమూరు పార్వతి, దల్లి అజయ్‌, మక్క చామంతి, బలరాంతో పాటు 50 కుటుంబాలు, సంతబొమ్మాళి మండలం లింగూడు పంచాయతీ ఎం.సున్నాపల్లి గ్రామానికి చెందిన మైలపల్లి గోవర్థన, టి.ఎర్రన్న, ఎ.వెంకట్రావు, ఎస్‌.రామారావు, మోస నారాయణ, ఎర్రన్న, బైపల్లి ధనరాజ్‌, చెక్కా కాంతారావు, వంకా శేఖర్‌, ఎస్‌.రాంబాబు, దూర్వాసులు, రాజేంద్రకుమార్‌, గురునాధరావు, గీతాగణపతి, సింహాచలం, గన్నయ్య తదితర 100 కుటుంబాలు, టెక్కలి మండలం తొలుసూరుపల్లికి చెందిన మాజీసర్పంచ్‌ గూన గోపాల్‌, పర్రి కృష్ణారావు, చింతాడ రేవతి, గూన అశోక్‌, హనుమంతు ఆనంద్‌, బమ్మిడి కిషోర్‌, శిష్టు ప్రభాకర్‌, మన్మధరావు, చిట్టయ్య, క్రిష్ణారావు, నాగభూషన్‌, గౌరీపతి తదితర 25 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. సంతబొమ్మాళి మండలం పాతమేఘవరం గ్రామానికి చెందిన సాహుకారి కుమార్‌ కూడా టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం ఖాయమని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి నిలువనీడ లేకుండా చేసిందన్నారు. బావితరాల భవిష్యత్‌ చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్‌సిక్స్‌ పథకాలతో ప్రతి ఇంటికి మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్కలి, సంతబొమ్మాళి మండలాల టీడీపీ అధ్యక్షులు బగాది శేషగిరి, జీరు భీమారావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 12:08 AM