పోలింగ్‌లో పీవోలే కీలకం
ABN , Publish Date - May 12 , 2024 | 12:00 AM
పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్ అఽధికారులే (పీవో) కీలకం. వారి ఆధీనంలోనే పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. ఇక్కడ వారిదే తుది నిర్ణయం. ఈవీఎంల మార్పు, పోలింగ్ నిలుపుదల, కొనసాగింపు, వాయిదా, భద్రత, పోలింగ్ ఏజెంట్లపై చర్యలు, చాలెంజ్ ఓటుపై ప్రిసైడింగ్ అధికారులదే తుది నిర్ణయం.

ఏపీవోలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే
పీడీఎంఎస్ యాప్‌తో ఎన్నికల నిర్వహణ
మార్గదర్శకాలు జారీచేసిన ఎన్నికల సంఘం
(నరసన్నపేట)
పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్ అఽధికారులే (పీవో) కీలకం. వారి ఆధీనంలోనే పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. ఇక్కడ వారిదే తుది నిర్ణయం. ఈవీఎంల మార్పు, పోలింగ్ నిలుపుదల, కొనసాగింపు, వాయిదా, భద్రత, పోలింగ్ ఏజెంట్లపై చర్యలు, చాలెంజ్ ఓటుపై ప్రిసైడింగ్ అధికారులదే తుది నిర్ణయం. సోమవారం జరిగే పోలింగ్‌నకు ఇప్పటికే పీవోలు, ఏపీవోలకు నాలుగు సార్లు శిక్షణ ఇచ్చారు. పోలింగ్ ముందురోజు నుంచి పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్‌రూము కౌంటర్లకు అప్పగించే వరకూ పూర్తి బాధ్యతలను అప్పగించారు. ఎన్నికల విధులు ఏ విధంగా నిర్వహించాలి, ఎలా చేపట్టాలి అన్న విషయంపై పీవోలు, ఏపీవోలు అనుస రించాల్సిన విధానాలను ఎన్నికల సంఘం మార్గదర్శకాలను జారీచేసింది. పీవోలు, ఏపీవోలు పోల్‌డే మానటరింగ్ సిస్టం యాప్‌తో అనుసంధానం చేస్తూ విధులు నిర్వహించాలి.
పోలింగ్ ముందు రోజు
ఫ ఎన్నికల విధుల్లో పాల్గొన్న పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు ఇతర సిబ్బంది తమకు కేటాయించిన నియోజకవర్గంలో డిస్టిబ్యూషన్ కేంద్రానికి ఉదయం 8 గంటలకు చేరుకోవాలి. డిస్టిబ్యూషన్ కేంద్రం ఏ సెక్టోరియల్ పరిధి, పోలింగ్‌కు ఎక్కడ కేటాయించారో సమాచారాన్ని కేంద్రాల్లో తెలుసుకోవాలి.ఫ తర్వాత సెక్టోరియల్ అధికా రులకు రిపోర్టు చేసి వారికి ఇచ్చిన సామగ్రిని తీసుకోవాలి. ఈ సామగ్రి చెక్‌లిస్టును ఒకటికి రెండుసార్లు పరిశీలించాలి. ఏదైనా లేక పోతే సెక్టోరియల్ అధికారికి తెలియజేస్తే వారికి సామగ్రి అందజేస్తారు. వాహనాలు బయలుదేరిన సమ యంలో పీడీ ఎంఎస్ యాప్ ద్వారా గమ్యస్థానం వివరాలు తెలియజేసి యాప్‌ను వినియోగించడం ప్రారంభించాలి.
డిస్టిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు చేరిన తర్వాత ఫారం-7ఏ పోటీచేసే అభ్యర్థుల వివరాలు పోస్టర్ అంటించాలి.
ఫారం-10 ఏజెంట్ల నుంచి వారీ నియామకపు లేఖలు తీసుకోవాలి
ఎనక్జర్12 - ఏజెంట్లకు ఎంట్రీ పాస్‌లు ఇవ్వాలి
ఎనక్జర్-13 - ఏజెంట్ల ఎంట్రీ పాస్‌ల ఖాతా రాయాలి
పోలింగ్ ప్రారంభానికి ముందు..
పీడీఎంఎస్ యాప్ ఓపెన్ చేసి పోలింగ్ స్టేషన్, నెంబరు, మండలం, నియోజకవర్గం తదితర వివరాలను యాప్‌లో నిక్షిప్తం చేయాలి
మాక్‌పోల్ టాలీషీట్స్ తయారుచేసుకోవాలి (అసెంబ్లీ, పార్లమెంట్లకు విడివిడిగా) తర్వాత బీయూను వీవీప్యాట్‌కు, వీవీప్యాట్‌ను కంట్రోల్ యూనిట్ (సీయూ)కు ఉదయం 5.30 గంటలకు కనెక్ట్ చేయాలి. వీవీప్యాట్ వెనుకఉన్న నల్లటి మీటను నిలువుగా తిప్పి సీయూ ఆన్‌చేయాలి. అనంతరం మాక్‌పాల్‌ను ప్రారంభించాలి. ఈ పోలింగ్‌లో వీవీప్యాట్ నుంచి జారిన ఏడు స్లిప్పులను చూడాలి. క్లోజ్ రిజల్ట్ క్లియర్(సీఆర్సీ)చేయాలి. తర్వాత పోటీలోని అభ్యర్థులకు నోటాతో కలిపి సమానంగా 50 ఓట్లను ఏజెంట్లతో వేయిం చాలి. (అసెంబ్లీ, పార్లమెంట్‌కు విడివిడిగా, ఒకేసమయంలో)
50 ఓట్లు వేసిన తర్వాత క్లోజ్ బటన్ నొక్కాలి. ఆపై రిజల్ట్ బటన్‌నొక్కాలి. ఎనక్జర్ -5 పార్ట్:1 మాక్ పోల్ సర్టిఫికెట్ నింపాలి. తర్వాత సీయూలో క్లియర్ బటన్‌నొక్కాలి. ఆపై టోటల్ బటన్ నొక్కి సున్నాచూపాలి. తర్వాత కంట్రోల్ యూ నిట్ స్విచ్ ఆఫ్ చేయాలి. దీంతో మాక్ పోలింగ్ పూర్తవు తుంది. వీవీప్యాట్‌లో నుంచి మాక్‌పోల్ స్లిప్ (57) తీసివేసి లెక్కించి స్లిప్‌లు వెనుక మాక్‌పోల్ అన్న స్టాంప్ వేసి కవర్ లో పెట్టిసీల్‌చేయాలి. పీవో ఈ కవర్‌పై ఏజెంట్లతో సంతకం చేయించాలి.
సీయూను గ్రీన్‌పేపర్ సీల్ (ఎ,బి), క్లోజ్ బటన్ వద్ద స్పెషల్ ట్యాగ్‌తో సీల్‌చేయాలి. వాటి మీదఉన్న నంబర్లను రాసుకోవాలి. వాటిపై పీవో, ఏజెంట్ సంతకాలు చేయాలి. సీయూకు పక్కన అడ్రాస్ ట్యాగ్ కట్టాలి. వీవీప్యాట్‌లోని స్లిప్పులు జారిపడే గది తలుపునకు ఇరువైపుల అడ్రాస్ ట్యాగ్‌కట్టి సీల్ వేయాలి.
ఇలా పోలింగ్ ప్రారంభం
ఉదయం ఏడు గంటలకు సీయూ స్విచ్ ఆన్ చేయాలి. (అసెంబ్లీ, పార్లమెంట్ సీయూలు ఒకేసారి) వీవీప్యాట్‌లో జారిపడే ఏడు స్లిప్పులను ఏజెంట్లను పరిశీలించాలని చెప్పాలి. తర్వాత టోటల్ బటన్ నొక్కి మొత్తం ఓట్లు సున్నా అనిచూపి పోలింగ్‌ను ప్రారంభించాలి. పీవో ఎనక్జర్-6లో పోలింగ్ ప్రారంభించామని రాయాలి. అనంతరం పోలింగ్ ప్రారంభించాలి.
ఫ ఏపీవో మార్డ్కు కాపీ పనిచూడాలి. ఓపీవో-1 17ఏ ఓటర్ల రిజిస్టర్ రాసి ఇంక్‌పెట్టాలి. ఓపీవో-2 ఓటరు స్లిప్పులు రాయాలి. ఓపీవో-3 పార్లమెంట్ కంట్రోల్ యూనిట్ బాధ్యత. ఓపీవో -4 అసెంబ్లీ కంట్రోల్ యూనిట్ బాధ్యత. పీవో ప్రతి రెండు గంటలకు పోలింగ్ అయిన ఓట్లును నమోదు చేసుకోవాలి.
పోలింగ్ పూర్తయిన తర్వాత టోటల్ బటన్ నొక్కి ఓట్ల సంఖ్య సరిచూసుకోవాలి. తర్వాత క్లోజ్ బటన్ నొక్కాలి. ఎన క్జర్ -6 పార్ట్-3 పూర్తి చేయాలి.
పీడీఎంఎస్‌లో పోలింగ్ పూర్తయినట్లు నమోదుచేయాలి. ఈవీఎంలను సీల్ చేయాలి
ఎనక్టర్ -8 (ఫారం-17 సి) పూర్తి చేయాలి. ఏజెంట్ల అందరికీ కాపీలు ఇవ్వాలి.
రిసెప్షన్ కేంద్రానికి చేరుకోగానే పీడీఎంఎస్ యాప్‌లో నమోదుచేయాలి. కౌంటర్ల వద్ద మెటీరియల్ ఇచ్చినట్లు ఎనక్జర్ -22 తీసుకోవాలి. పీవో డైరీలను అసెంబ్లీకి, పార్లమెం ట్‌కు వేర్వేరుగా తయారుచేసి రెండుకాపీలు ఇవ్వాలి. అవస రమైన చోట ఎనక్టర్ -14, 15,16,18,19, 20లను పూర్తి చేయాలి. అలాగే ఇతర ఫారాలు పూర్తిచేసి ఇవ్వాలి.
కరెంట్ పోతే ఈవీఎం పనిచేయదా ?
కరెంట్‌పోతే ఈవీఎం పనిచేయదా? ఓటు వేసే సమయంలో కరెంట్ పోతే ఈవీఎం పని చేస్తుందా? లేదా అన్న సందే హాలు చాలామందిలో ఉండొచ్చు. అయితే భారత్ ఎలక్ర్టానిక్స్ లిమిటెడ్, ఎలక్ర్టానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రూపొందించిన ఈవీఎంలు విద్యుత్ కనెక్షన్ లేకపోయినా పనిచేస్తాయి. సాధారణ 7.5 వోల్ట్ ఆల్కలిన్ పవర్‌ప్యాక్‌తో పనిచేస్తాయని ఆయా కంపెనీలు ప్రకటించాయి.
ఉదయం 5.30 నుంచి మాక్‌పోలింగ్
అభ్యర్థుల తరఫున నియమించిన ఏజెంట్ల సమక్షంలో ఉదయం 5.30 నుంచి 6.30లోగా కనీసం 50 ఓట్లతో మాక్ పోలింగ్ నిర్వహించి ఓట్లను లెక్కిస్తారు. మాక్ పోలింగ్‌లో కూడా నోటా ఆప్షన్ ఉంటుంది. మాక్ పోలింగ్, ఓట్ల లెక్కింపులో ఏమైనా తేడాలు వస్తే సంబందిత ఈవీఎంలను మార్చి కొత్త ఈవీఎంలను ఏర్పాటు చేస్తారు. మాక్ పోలింగ్ సక్రమమేనని నిర్దారణ అయితే ఈవీఎంలను ఏజెంట్లు సమక్షంలోనే జీవో చేసి సరిగా ఉదయం ఏడుగంటలకు ప్రారంభిస్తారు.
ఈఎంలు మొరాయిస్తే
ఈవీఎంలు మొరాయిస్తే పోలింగ్‌కు అంతరాయం కలు గుతుంది. ఓటింగ్ జరగాలంటే ఈవీఎంలో కంట్రోల్ యూని ట్(సీయూ)వీవీప్యాట్, బ్యాలెట్‌యూనిట్ (బీయూ) మూడు సక్రమంగా పనిచేయాలి. సీయూ, బీయూ పనిచేయకపోతే వాటితోపాటు వీవీప్యాట్‌ను మార్చి మాక్ పోలింగ్‌తో తనిఖీ చేస్తారు. సీయూ బ్యాటరీ, వీవీ ప్యాట్ పనిచేయకపోతే వాటిని మాత్రమే మారుస్తారు. మాక్‌పోలింగ్ అవసరం ఉండదు. పోలింగ్ మధ్యలో మొరాయించినా ఈవీఎంలకు మరమ్మతులు చేసినా ప్రారంభంకాకపోతే కొత్త ఈవీఎంను ఏర్పాటుచేస్తారు. అయితే అప్పటి వరకు పోలైన ఓట్ల వీవీ ప్యాట్లను భద్రపరుస్తారు. ఓట్ల లెక్కింపు అనంతరం వీవీ ప్యాట్లతో ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉంటేనే ఈ వీవీ ప్యాట్లను లెక్కిస్తారు. అలాగే వేసిన ఓటును ఏడు సెకండ్ల వ్యవధిలో పరిశీలించుకునే అవకాశం ఓటరుకు లభిస్తుంది. ఏమైనా తేడా అనిపిస్తే ప్రిసైడింగ్‌అధికారికి పిర్యాదు చేయవచ్చు.
రెండు గంటలకోసారి పోలింగ్ శాతం
పోలింగ్ ప్రారంభించిన తర్వాత ప్రతి రెండు గంటలకొసారి అధికారులు పోలింగ్ శాతాన్ని వెల్లడిస్తారు. మార్కింగ్ చేసిన జాబితా, ఓటరు స్లిప్పులు, సీయూ లెక్కలను సరిచూసిన తర్వాతే పోలింగ్ శాతాన్ని ప్రకటిస్తారు. ఉదయం 9, 11, ఒంటిగంట, సాయంత్రం మూడు గంటలకు పొలింగ్ ముగిసిన తర్వాత తుది శాతాన్ని వెల్లడిస్తారు. ప్రిసైడింగ్ అధికారులు సెక్టారు అధికారుల ద్వారా జిల్లా అధికారులకు నమోదైన పోలింగ్ శాతాన్ని చేరవేస్తారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు తెలియజేస్తారు.
ప్రత్యేక గుర్తులతో మార్కింగ్
పురుషులు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు మూడు రకాలుగా ఓటర్లను విభజించారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటరు ఆధారంగా అదనపు ప్రిసైడింగ్ అధికారి ఓటరు జాబితాలో మార్కింగ్ చేస్తారు. పురుషులు వస్తే అడ్డగీత, మహిళలు వస్తే అడ్డగీతతో పాటు వారి ఓటరు క్రమసంఖ్యకు వృత్తం చుడతారు. ట్రాన్స్‌జెండర్లు వస్తే అడ్డగీతతో పాటు వారిక్రమ సంఖ్యకు స్టార్ గుర్తు వేస్తారు. ఈ విధానంతో కేటగిరి వారీగా పోలింగ్ శాతాన్ని లెక్కించడం సులువు అవుతుంది.
ఆరు గంటల వరకే అనుమతి
సాయంత్రం ఆరుగంటలకు పోలింగ్ ముగిస్తుంది. అప్పటి వరకే ఓటర్లను పోలింగ్‌కేంద్రంలోకి అనుమతి ఇస్తారు. పోలింగ్ కేంద్రంలో ఉన్నవారంతా ఓటు వేసేవరకు పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ ముగిసిన వెంటనే పీవో సీయూలో క్లోజ్ బటన్ నొక్కుతారు. అనంతరం పోలైన ఓట్లలెక్కలు సరిచూసుకుంటారు. సరిచూసుకొని సీయూ స్వీచ్చ్ ఆఫ్ చేసి వీవీప్యాట్, బ్యాలెట్ యూనిట్లను డిస్‌కనెక్ట్ చేసి వీవీ ప్యాట్ నుంచి బ్యాటరీ తీసివేస్తారు. పోలింగ్‌ప్రారంభంలో సీయూ, వీవీ ప్యాట్‌కు వేసిన సీలు సక్రమంగానేఉన్నాయని పరిశీలించాక, పోలింగ్ ఏజెంట్లతో సంతకాలు తీసుకుంటారు. అనంతరం సీలు వేసి క్లోజ్ చేసిన సీయూ, బీయూ , వీవీ ప్యాట్లను ప్రత్యేక భద్రత నడుమ ఓట్ల లెక్కింపు కేంద్రాలలోని స్ట్రాంగ్ రూములకు తరలిస్తారు.