Share News

‘రాజ్యాంగ ఉల్లంఘనలతో హక్కులకు భంగం’

ABN , Publish Date - Jun 10 , 2024 | 11:21 PM

ప్రస్తుత ప్రభుత్వాలు రా జ్యాంగ ఉల్లంఘన లతో హక్కులకు భంగం కలిగి స్తున్నాయని, ఉపా కేసులతో అమాయకు లను హింసిస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా పోరా టం చేయాల్సిన అవసరం ఎంతై నా ఉందని ప్రజాసంఘాల నాయ కులు అన్నారు. బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరంలో సోమవారం రాజ్యహింస వ్యతిరేక సదస్సును నిర్వహించారు.

 ‘రాజ్యాంగ ఉల్లంఘనలతో హక్కులకు భంగం’

పలాసరూరల్‌: ప్రస్తుత ప్రభుత్వాలు రా జ్యాంగ ఉల్లంఘన లతో హక్కులకు భంగం కలిగి స్తున్నాయని, ఉపా కేసులతో అమాయకు లను హింసిస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా పోరా టం చేయాల్సిన అవసరం ఎంతై నా ఉందని ప్రజాసంఘాల నాయ కులు అన్నారు. బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరంలో సోమవారం రాజ్యహింస వ్యతిరేక సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణోదయ సంస్థ జిల్లా కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్‌, సీపీఐఎంఎల్‌ లిబరేషన్‌ నాయకులు మద్దిల మల్లేశ్వరరావు, ఏపీసీఎల్‌సీ జిల్లా నాయకులు పత్తిరి దానేసు, సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్‌ మాట్లాడుతూ.. ఛత్తీస్‌గడ్‌లో కగార్‌ పేరుతో అమాయక గిరిజనులపై మారణ హోమం సాగిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌లు దేశంలో రాజ్యాంగ అంశాలను విచ్ఛి న్నం చేసి నియంతృత్వ పోకడలకు పాల్పడుతున్నాయన్నారు. అన్ని రకాల హింసలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం ప్రజా సంఘాలపై ఉందని, దీనికి రైతులు, కార్మికులు, ఇతర వర్గాలు సైతం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సదస్సుకు పీవోడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కుసుమ అఽధ్యక్షత వహించగా, వివిధ సంఘాల ప్రతినిధులు వినోద్‌, తామాడ సన్యాసిరావు, ఎం.రామారావు, వీరాస్వామి, పిండి వెంకటరావు, పోతనపల్లి అరుణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2024 | 11:21 PM