గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Oct 16 , 2024 | 12:22 AM
గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యేలు అన్నారు. పల్లెపండగ కార్యక్రమాన్ని పలు గ్రామాల్లో మంగళవారం నిర్వహించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యేలు అన్నారు. పల్లెపండగ కార్యక్రమాన్ని పలు గ్రామాల్లో మంగళవారం నిర్వహించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
పల్లె పండగతో ప్రగతి: రవికుమార్
పొందూరు, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): పల్లె పండుగ కార్యక్రమంతో పల్లెలు ప్రగతి పథాన నడవను న్నాయని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. మంగళవారం పొందూ రు, తండ్యాం, కృషా ్ణపురం, నందివాడలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో మన్మధరావు, ఇన్ చార్జి తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఈవో మోహన్‌బాబు, ఎంపీపీ కె.ఉషారాణి, టీడీపీ నాయకులు కూన సత్యనారాయణ, సీహెచ్ రామ్మోహన్, అన్నెపు రాము, సీపాన శ్రీరంగ, బలగ శంకరభాస్కర్ పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధే ధ్యేయం: అశోక్
ఇచ్ఛాపురం, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ తెలిపారు. మంగళవారం కొఠారి పంచాయతీలో పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి రాజు, టీడీపీ నాయకులు దక్కత ఢిల్లీ రావు, సహదేవ్‌రెడ్డి, కామేష్, పద్మనాభం, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తిప్పన దుర్యోధనరెడ్డి పాల్గొన్నారు.
రూ.32 కోట్లతో పనులు: శంకర్
శ్రీకాకుళం రూరల్/గార, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో రూ.32 కోట్లతో రోడ్లు, కాలువలు పనులు చేపట్టనున్నట్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. రూరల్ మండలం తండ్యేంవలస, సిలగాం సింగువలస, అలికాం, భైరివానిపేట, గార మండలం కళింగపట్నం, కె.మత్స్యలేశం, బందరువాని పేట, వమరవెల్లి, తోణంగి గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మా ణానికి మంగళవారం శంకుస్థాపన చేశారు. కార్య క్రమంలో కూటమి నాయకులు మూకళ్ల శ్రీనివాసరావు, సీర రమణ తదితరులు పాల్గొన్నారు.
పల్లెలకు పూర్వ వైభవం: ఎంజీఆర్
హిరమండలం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): కూట మి ప్రభుత్వంలో పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా గ్రామాలకు పూర్వవైభవం తీసుకు వస్తామని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ‘పల్లె పండగ’లో భాగంగా మంగళవారం చవి తి సీది, పిండ్రువాడ కాలనీ, మహాలక్ష్మిపురం, అంబా వల్లి, నీలాదేవిపురం, కిట్టాలపాడు, భగీరధపురం గ్రామా ల్లో బీటీ రోడ్లు, కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జడ్పీటీసీ పి.బుచ్చిబాబు, నాయకులు తూలుగు తిరుపతి రావు, యాళ్ల నాగేశ్వరరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
గ్రామాభివృద్ధే లక్ష్యం: బగ్గు
జలుమూరు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. లింగాలవలస నుంచి ఉసిరికిజోల వరకు, మర్రివలస నుంచి మాకివలస వరకు, జలుమూరు నుంచి వెంకటాపురం మీదుగా బుడితి వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. స్వగ్రామం మర్రివలసను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో అప్పలనాయుడు, తహసీల్దార్ జె.రామారావు, టీడీపీ మండల అధ్యక్షుడు వెలమల రాజేంద్రనాయుడు, నాయకులు దుంగ స్వామిబాబు, బగ్గు గోవిందరావు, వెలమల రామారావు, చంద్రభూషణ పాల్గొన్నారు.