Share News

సూర్యప్రభ వాహనంపై వెంకన్న స్వామి

ABN , Publish Date - May 27 , 2024 | 11:20 PM

స్థానిక శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజున శ్రీని వాసుడు సోమవారం సూర్య ప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

 సూర్యప్రభ వాహనంపై వెంకన్న స్వామి
నరసన్నపేట: సూర్యప్రభ వాహనంపై దర్శనమిస్తున్న శ్రీవారు

నేడు పుష్పయాగం, చక్రతీర్థ స్నానం

నరసన్నపేట, మే 27: స్థానిక శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజున శ్రీని వాసుడు సోమవారం సూర్య ప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సుప్రభాత సేవ, పూజలు, అభి షేకాలను నిర్వహించారు. అనం తరం స్వామిని సూర్యప్రభ వాహనంపై వేంచేపు చేసి పెద్దపేట మీదుగా పట్టణంలో మెయిన్‌రోడ్డులో తిరువీధి ఉత్స వం చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి కృష్ణామాచార్యులు, మావుడూరి జగదీష్‌ బాబు, శ్రీనివాసాచార్యులు, ధర్మకర్త పి.చిన్నవీరభద్ర స్వామి తదితరుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. కోలాటం, తప్పెటగుళ్లు, కూచిపూడి నృత్య ప్రద ర్శనలు తిరువీధిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తొమ్మిది రోజుల పాటు స్వామి తిరువీధి ఉత్సవానికి వివిధ వాహ నాలను అందించిన దాతలను సత్కరించారు. యాగశాలలో పూర్ణాహుతి చేపట్టారు. బ్రహ్మోత్స వాల్లో భాగంగా మంగళవారం ఉదయం ఉత్సవ మూర్తులకు చక్రతీర్థ స్నానం చేయించ నున్నారు. సాయంత్రం పుష్పయాగం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

నేటితో ముగియనున్న అమ్మవారి ఉత్సవాలు

ఎల్‌.ఎన్‌.పేట: లక్ష్మీ నర్సు పేటలో జరుగుతున్న బంగారు సంతోషిమాత గ్రామదేవత ఉత్సవాలు మంగళవారంతో ముగియనున్నాయి. సోమవారం మహిళలు సామూహికంగా ముర్రాటలు తలపై పెట్టు కుని గుడికి చేరుకొని అమ్మవారికి చల్లదనం చేసి మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఎం.జనార్దనరావు, వి.పాండురంగనాఽథరాజు, చంద్రశేఖరరాజు, ఒనుము తవిటి నాయుడు, ఎం.దివాకర్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2024 | 11:21 PM