Share News

భువనేశ్వర్‌ నుంచి విశాఖ వరకూ వందేభారత్‌ రైలు

ABN , Publish Date - Mar 07 , 2024 | 11:40 PM

భువనేశ్వర్‌-విశాఖ-భువనేశ్వర్‌ వందేభారత్‌ రైలును ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 12న వర్చువల్‌ విధానం ద్వారా ప్రారంభించనున్నారు. సోమవారం మినహా ఈ రైలు వారానికి ఆరు రోజులు తిరుగుతుంది.

భువనేశ్వర్‌ నుంచి విశాఖ వరకూ వందేభారత్‌ రైలు

12న ప్రారంభం

పలాస, మార్చి 7: భువనేశ్వర్‌-విశాఖ-భువనేశ్వర్‌ వందేభారత్‌ రైలును ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 12న వర్చువల్‌ విధానం ద్వారా ప్రారంభించనున్నారు. సోమవారం మినహా ఈ రైలు వారానికి ఆరు రోజులు తిరుగుతుంది. మొత్తం 443 కిలోమీటర్లు ఈ రైలు పరుగెడుతుందని రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రతిరోజు ఉదయం 5.15 గంటలకు భువనేశ్వర్‌లో ఈ రైలు బయలుదేరి ఖుర్ధారోడ్‌-5.33గంటలు, బరంపూర్‌-7.05, ఇచ్ఛాపురం-7.18, పలాస-8.18, శ్రీకాకుళం రోడ్‌(ఆమదాలవలస)-9.03, విజయనగరం-9.48, విశాఖపట్నం-11 గంటలకు చేరుతుంది. తిరిగి విశాఖపట్నంలో 3.45, విజయనగరం-4.30, శ్రీకాకుళం రోడ్‌-5.28, పలాస-6.30, ఇచ్ఛాపురం-7.00, బరంపూర్‌-7.20, ఖుర్ధారోడ్‌-8.57, భువనేశ్వర్‌-9.30 గంటలకు చేరుకుంటుందని అధికారులు షెడ్యూల్‌ ప్రకటించారు. ప్రతి రైల్వేస్టేషన్‌ వద్ద ఈ రైలుకు రెండు నిమిషాల పాటు హాల్టింగ్‌ కల్పించారు.

Updated Date - Mar 07 , 2024 | 11:40 PM