Share News

ఎండి‘నది’

ABN , Publish Date - May 31 , 2024 | 11:41 PM

హిరమండలంలోని గొట్టాబ్యారేజీ వద్ద ఎగువ ప్రాంతంలో వంశధార నది పూర్తిగా ఎండిపోయింది. క్యాచ్‌మెంట్‌ ఏరియాలో కొన్ని నెలలుగా వర్షాలు లేక ఇన్‌ఫ్లో పూర్తిగా పడిపోయింది.

ఎండి‘నది’
గొట్టా బ్యారేజి వద్ద ఎండిపోయిన వంశధార

- గొట్టాబ్యారేజీ వద్ద పూర్తిగా పడిపోయిన ఇన్‌ఫ్లో

హిరమండలం, మే 31: హిరమండలంలోని గొట్టాబ్యారేజీ వద్ద ఎగువ ప్రాంతంలో వంశధార నది పూర్తిగా ఎండిపోయింది. క్యాచ్‌మెంట్‌ ఏరియాలో కొన్ని నెలలుగా వర్షాలు లేక ఇన్‌ఫ్లో పూర్తిగా పడిపోయింది. ఐదేళ్ల తర్వాత బ్యారేజీ ఎగువ ప్రాంతంలో నీరు అడుగంటిపోయిందని వంశధార అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నదీ పరివాహక ప్రాంతాల్లో బావుల్లో నీరందక.. కొళాయిల ద్వారా కూడా అంతంతమాత్రంగానే నీటి సరఫరా అవుతోంది. రబీలో సాగునీరందంచలేదని దుస్థితి నెలకొంది. కాగా.. ప్రస్తుతం నీరు లేకపోవడంతో బ్యారేజీ వద్ద మరమ్మతులు చేపట్టేందుకు అనువుగా ఉన్నా.. నిధుల లేమి కారణంగా పనులు చేపట్టలేని పరిస్థితి ఏర్పడిందని పలువురు పేర్కొంటున్నారు.

Updated Date - May 31 , 2024 | 11:41 PM