Share News

వైసీపీ పాలనలో యువతకే అధిక నష్టం

ABN , Publish Date - Mar 01 , 2024 | 11:53 PM

రాష్ట్రంలో వైసీపీ పాలనలో అధికంగా నష్టపోయింది యువతేనని, ఈ ఐదేళ్లలో వారి కోసం ప్రభుత్వం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చే యాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు డిమాం డ్‌ చేశారు.

వైసీపీ పాలనలో యువతకే అధిక నష్టం
సమావేశంలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు, టీడీపీ నేతలు

- వారి కోసం ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి

- ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు

అరసవల్లి, మార్చి1: రాష్ట్రంలో వైసీపీ పాలనలో అధికంగా నష్టపోయింది యువతేనని, ఈ ఐదేళ్లలో వారి కోసం ప్రభుత్వం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చే యాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు డిమాం డ్‌ చేశారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన రవి కుమార్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఒక్కో జిల్లాను ఒక రాజధానిగా అభివృద్ధి చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి యువత జీవితా లను నాశనం చేశారని విమర్శించారు. గత టీడీపీ ప్రభు త్వ హయాంలో 7.5 లక్షల ఉద్యోగాలను కల్పిస్తే, నేడు రాష్ట్రాన్ని దేశంలోనే అత్యధిక నిరుద్యోగం గల రాష్ట్రంగా తయారు చేసిన ఘనత జగన్‌రెడ్డిదేనని అన్నారు. ‘రూ.70 వేల కోట్ల అదానీ డేటా సెంటర్‌ను రాష్ట్రానికి చంద్ర బాబు తీసుకువచ్చారు. అలాగే వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకువచ్చారు. కానీ, జగన్‌ మాఫియా కు భయపడి వారంతా వెనక్కు వెళ్లిపోయారు. లక్షలాది మంది యువత జీవితాలను నాశనం చేశారు. రాష్ట్రంలో మూడు రాజధానులంటే నిరుద్యోగ రాజధాని, డ్రగ్స్‌ రాజ ధాని, డ్రై రాజధానిగా తయారు చేసిన ఘనచరిత్ర జగన్‌ సంపాదించాడు. ఒక క్రిమినల్‌ని ముఖ్యమంత్రిని చేస్తే ఏం జరుగుతుందో జగన్‌ చేసి చూపించాడు. యువ ఓట రులారా.. ఆలోచించండి.. గత టీడీపీ ప్రభుత్వం, నేటి వైసీపీ ప్రభుత్వం పనితీరును బేరీజు వేయండి. మీ భవిష్యత్తును తీర్చిదిద్దే వారికే ఓటు వేయండి. రాష్ట్ర భవిష్యత్తుకు సహకరించండి’ అని ఎంపీ పిలుపునిచ్చారు. అనంతరం ఓట్‌ ఫర్‌ బెటర్‌ పోస్టర్లను ఆవిష్కరించారు.

- టీడీపీ జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌ మాట్లా డుతూ.. రాబోయే ఎన్నికలు ఓ కురుక్షేత్ర యుద్ధమని, ఈ యుద్ధంలో టీడీపీ(ధర్మం) గెలుపు తఽథ్యమన్నారు. యువ త ఆలోచించి ఓటు వేయాలని, తమ భవిష్యత్తును నిర్ణ యించుకోవాలని పిలుపునిచ్చారు. ‘గత ఐదేళ్లలో యువత, నిరుద్యోగుల కోసం వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో ఆలో చించండి. మెగా డీఎస్సీ ఎక్కడ. ప్రతీ ఏడాది జాబ్‌ క్యాలెండర్‌ ఏదీ. నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇచ్చిన స్టడీ సెంటర్లు ఏమయ్యాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 16.40 లక్షల మందికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తే, వైసీ పీ ప్రభుత్వం 10 లక్షల మందికి మాత్రమే ఇచ్చింది. 6.85 లక్షల మందికి నిరుద్యోగ భృతిని ఇచ్చాం. ఇప్పుడు నిరు ద్యోగ భృతి ఏదీ. టీడీపీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రతి ఏడాది జాబ్‌ క్యాలెం డర్‌ను ప్రకటిస్తాం. నిరుద్యోగులకు రూ.3వేల భృతి కల్పి స్తాం. మీ భవిష్యత్తుకు భరోసా తెలుగుదేశంతోనే. టీడీపీ, జనసేన కూటమిని ఆదరించి గెలిపించాలి.’ అని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు పీఎంజే బాబు, బొనిగి భాస్కరరావు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమణ మాదిగ, పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణంనాయుడు,, రాష్ట్ర తెలుకల సాధికార సమితి డైరెక్టర్‌ కొమ్మనాపల్లి వెంకటరామరాజు, రాష్ట్ర జంగమ సాధికార సమితి డైరెక్టర్‌ విభూది సూరి బాబు, మెండ దాసునాయుడు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 11:53 PM