Share News

అమ్మో.. గొట్టా బ్యారేజీ

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:52 PM

వంశధార ప్రాజెక్టు పేరు చెబితే పదవిలో ఉన్న ప్రజాప్రతినిధులు ఉలిక్కిపడుతుంటారు. పదవుల్లో ఉన్న నాయకులు హిరమండలం ప్రాంతంలోని వంశధార ప్రాజెక్టుకు సంబంధించి ఏమైనా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తే పదవులు కోల్పోతారనే సెంటిమెంట్‌ ఉంది. అలాగే, ఈ నదిపై ఉన్న గొట్టా బ్యారేజీపై నుంచి ప్రయాణించినా పదవీచ్యుతులు అవుతామనే సెంటిమెంట్‌ నాయకుల్లో ఉంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. ప్రాజెక్టు పరిధిలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి తిరిగి వెళ్లే సరికి పలువురు ముఖ్యమంత్రులు, మంత్రులు పదవులు కోల్పోవడం, సంక్షోభాన్ని ఎదుర్కొన్న వంటి సంఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి.

అమ్మో.. గొట్టా బ్యారేజీ
గొట్టా బ్యారేజీ

హిరమండలం

ఇవీ ఉదాహరణలు..

ఫ టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు పాడలి జంక్షన్‌ సమీపంలో 11 టీఎంసీలతో వంశధార రిజర్వాయర్‌ నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. రాజధానికి చేరుకోకుండానే పదవికి గండం ఏర్పడి కొద్దిరోజుల్లోనే పదవీచ్యుతులయ్యారు.

ఫ టీడీపీ హయాంలో ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తమ్మినేని సీతారాం, ఇరిగేషన్‌ మంత్రిగా ఉన్న సమయంలో కడియం శ్రీహరి వంశధార ప్రాజెక్టును సందర్శించారు. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారి శాఖలను మార్చారు.

ఫ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో ఎన్నికల ప్రచారానికి ఈ ప్రాంతం మీదుగా సినీనటుడు మోహన్‌బాబు వచ్చారు. తిరిగి వెళ్లే సరికి పార్టీ నుంచి సస్పెండ్‌కు గురయ్యారు.

ఫ సీఎం హోదాలో జలగం వెంగళరావు వంశధార ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి తిరిగి వెళ్లే సరికి ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ ఆయన్ను ముఖ్యమంత్రి పదవిని నుంచి తొలగించారు. అలాగే సీది వంతెన నిర్మాణానికి శంకుస్థాపనకు వచ్చిన భవనం వెంకట్రామ్‌ తన సీఎం పదవిని కోల్పోయారు.

ఫ వంతెన ప్రారంభోత్సవానికి వచ్చిన నేదురమల్లి జనార్దన రెడ్డి కూడా ముఖ్యమంత్రి పదవిని కోల్పోయా రు. ఈ ప్రాజెక్టు పరిధిలో పర్యటించిన టంగుటూరి అంజయ్య, నేదురమల్లి జనార్దనరెడ్డిలు కూడా రాజధానికి తిరిగి వెళ్లిన తర్వాత పదవులు కోల్పోయారు.

==========

Updated Date - Apr 19 , 2024 | 11:52 PM