వైభవంగా ఉమాకామేశ్వరి రథయాత్ర
ABN , Publish Date - Jan 18 , 2024 | 12:17 AM
పురుషోత్తపురంలో ఉమాకామేశ్వరిస్వామి వారి రథయాత్ర బుధవారం వైభవంగా నిర్వహించారు.
సరుబుజ్జిలి: పురుషోత్తపురంలో ఉమాకామేశ్వరిస్వామి వారి రథయాత్ర బుధవారం వైభవంగా నిర్వహించారు. స్వా మివారి ఉత్సవ విగ్రహాలను వేదమంత్రాల నడుమ అర్చకులు గంగవరపు వాసుదేవశర్మ, ఆనందశర్మ రథంపైకి తరలించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను గ్రామ పురవీధుల్లో తిరువీధి నిర్వహించారు. అనంతరం తోట జాతర కార్యక్రమం చేపట్టా రు. ఈ జాతరకు జలుమూరు, సరుబుజ్జిలి, ఆమదాలవలస మండలాల భక్తులు విశేషంగా తరలివచ్చారు.