Share News

ఇద్దరికి ఏడేళ్లు జైలు

ABN , Publish Date - May 17 , 2024 | 11:59 PM

తంప గ్రామానికి చెందిన బోయితి తిరుపతిరావు, మిన్నమ్మలకు ఏడేళ్లు జైలు శిక్ష విధించినట్టు ఎస్‌ఐ నారాయణస్వామి చెప్పారు.

ఇద్దరికి ఏడేళ్లు జైలు

హిరమండలం: తంప గ్రామానికి చెందిన బోయితి తిరుపతిరావు, మిన్నమ్మలకు ఏడేళ్లు జైలు శిక్ష విధించినట్టు ఎస్‌ఐ నారాయణస్వామి చెప్పారు. శుక్రవారం ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. తంప గ్రామంలో 2020లో వరకట్న వేధింపులతో హారతి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. అప్పట్లో పాలకొండ డీఎస్పీ రారాజు ప్రసాద్‌ మృతిరాలి భర్త తిరుపతిరావు, అత్త మిన్నమ్మలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సోంపేటకు చెందిన ఆరో అదనపు సెషన్స్‌ న్యాయాధికారి బి.భాస్కరరావు శుక్రవారం ఏడేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పార. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె.వెంకటరావు కేసు వాదించగా, ఎస్‌ఐ నారాయణస్వామి ఇందుకు సంబంధించిన సాక్షాధారాలు సేకరించారు.

Updated Date - May 18 , 2024 | 12:00 AM