Road Accident రెండు రోడ్డు ప్రమాదాలు
ABN , Publish Date - Dec 29 , 2024 | 11:52 PM
Road Accident జిల్లాలో ఆదివారం రెండు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా ఒకరు గాయపడ్డారు. అలాగే వివిధ కేసుల్లో నిందితులపై పోలీసులు కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

బైక్ అదుపు తప్పి.. విద్యుత్ స్తంభాన్ని ఢీకొని
ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
జిల్లాలో ఆదివారం రెండు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా ఒకరు గాయపడ్డారు. అలాగే వివిధ కేసుల్లో నిందితులపై పోలీసులు కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
వజ్రపుకొత్తూరు, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని అనకా పల్లి సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం లో ఒక యువ కుడు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు, ఎస్‌ఐ నిహార్ తెలిపిన వివ రాలిలా ఉన్నాయి. పలాస పట్టణం లేబర్ కాలనీకి చెందిన మురుపల్లి శివ(26) మిత్రుడు పలాసకు చెందిన శంకు షణ్ముఖరావుతో కలిసి అనకాపల్లి వైపు వస్తున్న సమయంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. దీంతో వాహనం పల్టీ కొట్టడంతో శివ అక్కడికక్కడే మృతి చెందాడు. షన్ముఖరావుకు తీవ్రగాయాలు కావడంతో 108 వాహనంలో పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు. అయితే వీరు అనకాపల్లి ప్రాంతా నికి ఎందుకు వెళ్లారనే విషయమై విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
గతంలోనూ ఈ ప్రాంతంలోనే..
ఆదివారం ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే నెలరోజుల కిందట యశ్వంత్ అనే యువకుడు ద్విచక్రవానం పల్టీకొట్టి మృతిచెందాడు. అలాగే రెండు నెలల కిందట ఇద్దరు యువకులు అనకాపల్లికి చెందిన యువతిని ఢీకొట్టడంతో ఆమె తీవ్రగా యాలతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదాలకు అతివేగమే కారణ మని స్థానికులు చెబుతున్నారు. హెల్మెట్ ధరించక పోవడం, వాహనం వేగం నియంత్రణ లేకపోవడం, ప్రమాదాలపై పోలీసు అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో తరచూ ఇలాంటివి సంభవిస్తున్నాయని స్థానికులు పేర్కొంటు న్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
తమ్మినాయుడు పేట వద్ద..
ఎచ్చెర్ల, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేటకు సమీపంలో సనపలవానిపేటకు ఎదురుగా జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి మండలం మామిడిపాలెం గ్రామానికి చెందిన చిన్ని కృష్ణ(39) సీ ఫుడ్స్‌తో ఉన్న వ్యాన్ డ్రైవ్ చేసుకుంటూ ఒడిశా వెళ్తుండగా.. సన పలవానిపేట వద్ద ఆగిన ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో కృష్ణ అక్కడి కక్కడే మృతిచెందాడు. కృష్ణ భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎచ్చెర్ల పోలీ సులు కేసు నమోదు చేశారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
లావేరు, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): రాయినింగారిపేటకు చెందిన జగ్గురోతు సత్యనారాయణ (30) మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సత్యనారాయణ తన వ్యక్తిగత కారణాల వల్ల కొద్ది రోజులుగా మనస్తాపం చెందుతున్నాడు. ఈ క్రమంలో ఇంటి వద్ద ఉన్న గడ్డి మందును శనివారం ఉదయం తాగాడు. ఇలా అపస్మారక స్థితిలో ఉన్న అతడిని 108 వాహనంలో చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శనివారం అర్థరాత్రి మృతి చెందారు. అతడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం ఏఎస్‌ఐ జగన్మోహన్‌రావు కేసు నమోదు చేశారు.
ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ
ఎచ్చెర్ల, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): తోటపాలెం ఎస్‌ఏటీ నగర్‌లో నివాసం ఉంటున్న ఓ ఉపాధ్యాయుని ఇంట్లో శనివారం చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలచింతల శేఖర్, అతని భార్య ఉపాధ్యాయులు. శనివారం ఉదయం విధులకు వెళ్లిపోయారు. తిరిగి సాయం త్రం ఇంటికి వచ్చి తలుపులు తెరిచి చూసేసరికి ఇంటి వెనుక నుంచి దొంగలు ప్రవేశించారు. బీరువాలోని ఆరున్నర తులాల బంగారం, రూ.50 వేలు నగదు అపహరించుకుపోయారు. ఆదివారం శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం సీసాలు స్వాధీనం
రణస్థలం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఎన్‌ఫోర్స్ మెంట్ సిబ్బంది శనివారం చేపట్టిన దాడుల్లో 35 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్ సీఐ అనురాధ తెలిపారు. ఆదివారం ఆమె తెలిపిన వివరాల మేరకు.. లావేరు మండ లం కొత్తకుంకాం గ్రామానికి చెందిన ఎల్.భవాని ఇంట్లో తనిఖీ చేయగా మద్యం సీసాలు పట్టుబడ్డాయన్నారు. దీంతో ఆమెను రణస్థలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పజెప్పారు. కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.
నెలలో 17 కేసుల నమోదు
ఇచ్ఛాపురం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఈ నెలలో చేపట్టిన దాడుల్లో 17 కేసులు నమోదు చేసి 17మందిని అరెస్టు చేసినట్టు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ పి.దుర్గా ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. ఒడిశా మద్యం సీసాలు 71, డ్యూటీ పెయిడ్ లిక్కర్ 82 సీసాలు, 37 లీటర్ల సారా, 18.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సారా కేసులో ఇక ద్విచక్ర వాహనం, గంజాయి కేసులో ఒక ద్విచక్ర వాహనం సీజ్ చేశా మన్నారు. పాత కేసుల్లో పట్టుబడినవారిని ఇచ్ఛాపురం, మందస మండలాల తహ సీల్లార్ల వద్ద బైండోవర్ చేసినట్టు తెలిపారు. సారా, గంజాయి, ఒడిశా మద్యం ఎవరైనా తరలిస్తే 86399 59250, 94408 30385 ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
పేకాట ఆడుతున్న ముగ్గురిపై కేసు
కొత్తూరు, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పేకాట ఆడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ ఎండీఅమీర్ ఆలీ తెలిపారు. మండల కేంద్రంలోని రెల్లివీధిలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను ఆదివారం అదుపులోకి తీసుకున్నా మన్నారు. వారి నుంచి రూ.1020 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.