theft చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్
ABN , Publish Date - Dec 31 , 2024 | 11:44 PM
theft నవతల ఘాట్ రోడ్డు వద్ద ఈనెల 26న జరిగిన చోరీ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను మంగళవారం అరెస్ట్ చేసినట్లు నరసన్నపేట సీఐ జె.శ్రీనివాసరావు తెలిపారు.

జలుమూరు, (సారవకోట) డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): నవతల ఘాట్ రోడ్డు వద్ద ఈనెల 26న జరిగిన చోరీ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను మంగళవారం అరెస్ట్ చేసినట్లు నరసన్నపేట సీఐ జె.శ్రీనివాసరావు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. నవతల వద్ద ఒక వాహనాన్ని ఇద్దరు వ్యక్తులు నిలిపి వాహనంలోని వారి వద్ద నుంచి రూ.66 వేలు నగదును దోచుకున్నారు. హెచ్‌సీ కృష్ణారావు కేసు నమోదు చేశారు. మంగళవారం జలుమూరు మండలం టెక్కలిపాడు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన కేశభ గౌడ, హృషీకేష్ స్వర్గాలును పట్టుకొని విచారణ చేయగా వారు ఈచోరీ చేసినట్లు గుర్తించి వారి వద్ద నుంచి చోరీ సొమ్మును, బైక్, రెండు స్టీలు కత్తులను స్వాధీనం చేసుకుని నిందితులను పాతపట్నం కోర్టులో హాజరుపరిచామని తెలిపారు.
దాడి కేసులో ఇద్దరికి రిమాండ్
శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): నగరంలో శుభాకార్యానికి వచ్చిన ఓ మహిళను ఇద్దరు వ్యక్తులు తాగిన మత్తులో దాడికి పాల్పడిన ఘటనలో వారికి న్యాయస్థానం 20 రోజులు రిమాండ్ విధించింది. వన్‌టౌన్ ఎస్‌ఐ ఎం.హరికృష్ణ తెలిపిన వివరాల మేరకు ఈ నెల 29వ తేది ఆదివారం మధ్యాహ్నం లావేరు మండలం మురపాక గ్రామానికి చెందిన లింగాల అప్పమ్మ.. శ్రీకాకుళం నగరం టౌన్ హాల్‌లో ఉన్న ఓ కల్యాణ మండపంలో శుభకార్యానికి వెళ్లింది. తిరిగి తన ఇంటికి చెల్లెలు కొడుకు బండిపై వెళ్తుండగా ఎండీ సల్మాన్‌ఖాన్, కుందు ఎర్రయ్య అనే ఇద్దరు వ్యక్తులు మద్యం తాగి ద్విచక్ర వాహనంపై వచ్చి వారిని గుద్ది పడిపో యారు. ఈ క్రమంలో అప్పమ్మ వళ్లే తాము పడిపోయామన్న కోపంతో ఆమెపై దాడి చేశారు. ఈ ఘటనపై అప్పమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం వన్ టౌన్ ఎస్‌ఐ కేసు నమోదు చేసి.. మంగళవారం దాడికి పాల్పడిన ఆ ఇద్దరిని కోర్టు లో హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం వారిద్దరిని 20 రోజులు రిమాండ్ విధిం చడంతో వారిని అంపోలు జైలుకి తరలించారు.
కోళ్ల వ్యాన్ ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు
క్షతగాత్రులకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్
జి.సిగడాం, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): స్థానిక హెచ్‌పీ గ్యాస్ గోదాం వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమా దంలో మండల కేంద్రానికి చెందిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కొంచాడ వెంకటేష్, కొంచాడ సోమేశ్వరరావు, సువ్వాడ మోహన రావు గ్యాస్ గోదాం నుంచి వస్తుండ గా కోళ్ల వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘట నలో వీరు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే సమయంలో అటుగా వస్తున్న ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తక్షణమే స్పందించి క్షతగాత్రుల వద్దకు చేరుకొని 108 వాహనానికి ఎమ్మెల్యే సమాచారం అందించారు. 108 వాహ నం వచ్చేవరకు ఉండి క్షతగాత్రులకు ధైర్యం చెప్పి కొంత నదగు అందించారు. చికిత్స నిమిత్తం వారిని రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపారు.