Share News

జగన్‌రెడ్డి పాలనలో ఇరవై ఏళ్లు వెనక్కి

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:10 AM

జగన్‌ రెడ్డి పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిం దని ఆమదాలవలస అసెంబ్లీ నియోజ కవర్గ టీడీపీ అభ్యర్థి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు.

జగన్‌రెడ్డి పాలనలో ఇరవై ఏళ్లు వెనక్కి
బూర్జ: అవగాహన కల్పిస్తున్న కూన రవికుమార్‌

- టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌

బూర్జ: జగన్‌ రెడ్డి పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిం దని ఆమదాలవలస అసెంబ్లీ నియోజ కవర్గ టీడీపీ అభ్యర్థి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం డొంకలపర్త గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాలపై అవ గాహన కల్పించారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చిన జగన్‌ను ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామంలో పలు కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి. మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌, మాజీ జడ్పీటీసీ ఆనేపు రామకృష్ణ, ఉమ్మడి పార్టీల నాయకులు కొల్ల జయరాం, సేపాన రమేష్‌, పేరాడ సూరపునాయుడు, పిల్లా జగన్‌, గోవిందరావు, రాంజీ, గోపి, శ్రీరామ్మూర్తి తదిత రులు పాల్గొన్నారు.

డ్రగ్‌ క్యాపిటల్‌గా మార్చేశారు..

- ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌

కవిటి: రాష్ట్ర రాజధాని విశాఖ అని చెప్పిన జగన్‌ రెడ్డి.. చివరికి డ్రగ్‌ క్యాపిట ల్‌గా మార్చారని ఇచ్ఛాపు రం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. రామయ్య పుట్టుగలో తన స్వగృహం వద్ద సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని పేరు చెప్పిన జగన్‌రెడ్డి విశాఖ కేంద్రంగా డ్రగ్స్‌ను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో జిమ్మిక్కులు చేసి వాటిని టీడీపీ పైకి నెట్టివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీసీలను టార్గెట్‌ చేసి వేధించడమే జగన్‌ పాలన అని దుయ్యబ ట్టారు. ముఖ్యమంత్రి స్వంత జిల్లాలో చేనేత కుటుంబం ఆత్మహత్యకు జగన్‌రెడ్డి బాధ్యత వహించి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈయనతో పాటు నేతలు బి.రమేష్‌, ఎస్‌.చంద్రమోహన్‌, ఈశ్వర్‌, శ్యామ్‌ తదితరులు ఉన్నారు.

ప్రజలకు రక్షణ కరువు: గొండు శంకర్‌

అరసవల్లి: జగన్‌ రెడ్డి అరాచక పాలనలో రాష్ట్రంలో బడుగు, బల హీన వర్గాల వారి ప్రా ణాలకు రక్షణ కరువైం దని ఎన్డీఏ కూటమి శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌ అన్నారు. నగరంలోని ఏడురోడ్ల కూడలి వద్ద ఆయన పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం ప్రభుత్వ దుర్మార్ఘ పాలనపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శంకర్‌ మాట్లాడుతూ.. సీఎం స్వంత జిల్లాలోనే సాధా రణ చేనేత కార్మి కుని భూముల ఆక్రమణతో కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్‌గా ఉన్న రాష్ట్రా న్ని డ్రగ్‌ ఆంధ్రాగా మార్చిన ఘనత జగన్‌రెడ్డికి దక్కుతుం దన్నారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బొని గి భాస్కరరావు, నాయకులు పాండ్రకి శంకర్‌, రెడ్డి గిరిజా శంకర్‌, అంబటి లక్ష్మీరా జ్యం, నాగేంద్రయాదవ్‌, మూకళ్ల శ్రీను, దేశళ్ల విస్సు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2024 | 12:10 AM