Share News

బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలిగా కణితి

ABN , Publish Date - Mar 18 , 2024 | 11:52 PM

స్థానిక జూనియర్‌ సివిల్‌ కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలిగా సీనియర్‌ న్యాయవాది కణితి విజయ లక్ష్మీబాయి హాట్రిక్‌ సాధించారు.

బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలిగా కణితి

ఆమదాలవలస: స్థానిక జూనియర్‌ సివిల్‌ కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలిగా సీనియర్‌ న్యాయవాది కణితి విజయ లక్ష్మీబాయి హాట్రిక్‌ సాధించారు. ఆమ దాలవలస బార్‌ అసోసియేషన్‌ పాలకవర్గ ఎన్నికలకు శు క్రవారం ఆమె నామినేషన్‌ వేయగా, మరెవరూ నామి నేషన్‌ వేయకపోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు సోమవారం ఎన్నికల అధికారి, సీనియర్‌ న్యాయవాది సాధు ధనుంజయరావు ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా రమణమూర్తి, కార్యదర్శిగా ఎ.విజయ్‌కుమార్‌, సంయుక్త కార్యదర్శిగా బి.మోహన్‌ రావు ఎన్నికయ్యారు. రాష్ట్రంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళా న్యాయవాది గా ఆమె గుర్తింపు పొందగా, ఇప్పుడు వరుసగా మూడుసారి కొనసాగడం గమనార్హం. ఈమె ఎన్నికపై పలువురు అభినంధనలు తె లిపారు.

Updated Date - Mar 18 , 2024 | 11:53 PM