Share News

Trucks తప్పుకోలేక...

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:16 AM

కొల్లివలస-నారాయణపురం రహదారిలో సోమవారం గంటకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి.

Trucks  తప్పుకోలేక...
రహదారి మధ్యలో ఇరుక్కున్న లారీలు

- రహదారిపై ఇరుక్కున్న లారీలు

- గంటకు పైగా ట్రాఫిక్‌ జాం

బూర్జ, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): కొల్లివలస-నారాయణపురం రహదారిలో సోమవారం గంటకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇసుక రీచ్‌కు లారీలు, ట్రాక్టర్లు నిత్యం ఈ రహదారిలో ప్రయాణం సాగిస్తుంటాయి. వీటితో రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రత్యామాయ మార్గం లేకపోవడంతో ఈ రహదారి గుండానే ఇసుకను తరలించాల్సి వస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఈ రోడ్డుపై ఎదురెదురుగా వచ్చిన వాహనాలు తప్పుకోవడానికి మార్గంలేక ఇరుక్కున్నాయి. దీంతో రెండువైపులా దాదాపు గంటసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఇక్కడ తరచూ ఇదే తరహా సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అధికారులు స్పందించి...అటు రహదారికి మరమ్మతులు చేయడంతో పాటు వాహనాల రాకపోకలను, ప్రమాదాలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.

Updated Date - Dec 31 , 2024 | 12:16 AM