Share News

సమస్యాత్మక గ్రామాల్లో నిఘా ఉండాలి: ఆర్వో

ABN , Publish Date - May 19 , 2024 | 11:47 PM

ఎన్నికల అనంతరం కూడా సమస్యాత్మక గ్రామాల్లో నిరంతర నిఘా ఉండాలని రిటర్నింగ్‌ అధికారి, సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ అన్నారు. ఆదివారం సబ్‌ కలెక్టర్‌ కార్యాల యంలో డీఎస్పీ బాల చంద్రారెడ్డితో కలిసి పోలీస్‌, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వ హించారు.

సమస్యాత్మక గ్రామాల్లో నిఘా ఉండాలి: ఆర్వో

టెక్కలి: ఎన్నికల అనంతరం కూడా సమస్యాత్మక గ్రామాల్లో నిరంతర నిఘా ఉండాలని రిటర్నింగ్‌ అధికారి, సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ అన్నారు. ఆదివారం సబ్‌ కలెక్టర్‌ కార్యాల యంలో డీఎస్పీ బాల చంద్రారెడ్డితో కలిసి పోలీస్‌, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వ హించారు. క్షేత్రస్థాయిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని, అవసరమైతే గ్రామాల వారీగా బైండోవర్లు చేయాలన్నారు. నేరచరిత్ర, చెడు ప్రవర్తన కలిగిన వారిపై దృష్టి సారించాలని, శాంతి భద్రతల సమస్యలు తలెత్తరాదన్నారు. 144 సెక్షన్‌ అమ లులో ఉందని, పోలీసులు సమస్యాత్మక గ్రామాల్లో సైరన్‌ కొడుతూ ఎప్పటికప్పుడు చక్కర్లు కొట్టాలని డీఎస్పీకి సూచించారు. సమావేశంలో ట్రైనీ డీఎస్పీ రాజా, సీఐ పి.పైడయ్య, ఎస్‌ఐలు వెంకటేశ్వరరావు, కిషోర్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2024 | 11:47 PM