Share News

రేపటి నుంచి ఆర్టీసీ డ్రైవింగ్‌ స్కూల్‌లో శిక్షణ

ABN , Publish Date - Mar 18 , 2024 | 11:56 PM

ఏపీఎస్‌ఆర్టీసీ హెవీ డ్రైవింగ్‌ స్కూల్‌ (శ్రీకాకుళం)లో 15వ బ్యాచ్‌కు శిక్షణ ఈ నెల 20వ తేదీన ప్రారంభించనున్నట్టు జిల్లా ప్రజారవాణా అధికారి విజయకుమార్‌ తెలిపారు.

రేపటి నుంచి ఆర్టీసీ డ్రైవింగ్‌ స్కూల్‌లో శిక్షణ

అరసవల్లి: ఏపీఎస్‌ఆర్టీసీ హెవీ డ్రైవింగ్‌ స్కూల్‌ (శ్రీకాకుళం)లో 15వ బ్యాచ్‌కు శిక్షణ ఈ నెల 20వ తేదీన ప్రారంభించనున్నట్టు జిల్లా ప్రజారవాణా అధికారి విజయకుమార్‌ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీఎస్‌ఆర్టీసీలో మాత్రమే హెవీ డ్రైవింగ్‌ స్కూల్‌ ఉందని, శిక్షణలో ఉత్తమ డ్రైవర్లుగా తీర్చిదిద్దడం జరుగుతోం దని తెలిపారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీలో డ్రైవర్లకు శిక్షణతో పాటు, హెవీ లైసెన్స్‌ ఐదేళ్లకు ఒకసారి రెన్యువల్‌ చేసుకునేటప్పుడు ఒక రోజు సర్టిఫికెట్‌ ఉండాలని, అది ఈ డ్రైవింగ్‌ స్కూల్‌ ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి హెవీ లైసెన్సు రెవన్యువల్‌కు వెళ్లే ప్రతీ ఒక్కరూ ఒకరోజు ట్రైనింగ్‌ తీసుకుని రవా ణాశాఖ సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ప్రతీ ఒక్క రూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 99630 91999, 7382923293 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

Updated Date - Mar 18 , 2024 | 11:56 PM