నేడు ‘మీకోసం’ వినతుల కార్యక్రమం రద్దు
ABN , Publish Date - Sep 15 , 2024 | 11:47 PM
శ్రీకాకుళంలోని జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక.. ‘మీ కోసం’ కార్యక్రమాన్ని 16న రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.
శ్రీకాకుళం కలెక్టరేట్/ క్రైం, సెప్టెంబరు 15: శ్రీకాకుళంలోని జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక.. ‘మీ కోసం’ కార్యక్రమాన్ని 16న రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. మిలాద్ ఉన్ నబీ.. ప్రభుత్వ సెలవు దినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ‘మీ కోసం’ కార్యక్రమాన్ని కూడా ఈసారి రద్దు చేస్తున్నట్టు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.