Share News

ఎచ్చెర్ల బీజేపీకే

ABN , Publish Date - Mar 27 , 2024 | 11:51 PM

ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా నడుకు దిటి ఈశ్వరరావు(ఎన్‌ఈఆర్‌)ను పార్టీ అధిష్ఠానం బుధవా రం ఎంపిక చేసింది. పొత్తులో భాగంగా బీజేపీకి ఈ సీటు ను కేటాయించారు.

ఎచ్చెర్ల బీజేపీకే

-ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ఎన్‌ఈఆర్‌

- ఎట్టకేలకు జాబితా విడుదల

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా నడుకు దిటి ఈశ్వరరావు(ఎన్‌ఈఆర్‌)ను పార్టీ అధిష్ఠానం బుధవా రం ఎంపిక చేసింది. పొత్తులో భాగంగా బీజేపీకి ఈ సీటు ను కేటాయించారు. ఎన్‌ఈఆర్‌ ప్రస్తుతం విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. గతంలో రణస్థ లం టీడీపీ మండల అధ్యక్షుడిగా వ్యవహరించారు. అతని కుటుంబ సభ్యులు పదిహేనేళ్లుగా రాజకీ యంలో చురుగ్గా ఉన్నారు. ఈశ్వరరావు తల్లి మహాలక్ష్మి గతంలో బంటుపల్లి సర్పంచ్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆయన సతీమణి రజిని బంటుపల్లి సర్పంచ్‌గా కొనసాగుతు న్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరక్టర్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఇదిలా ఉండగా.. జిల్లా లో ఎనిమిది నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. అయితే ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజ కవర్గం శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉన్నప్ప టికీ పార్లమెంట్‌ నియోజకవర్గం మాత్రం విజయనగరం పరిధిలో ఉంది. ఇంకనూ విజయనగరం పార్లమెంట్‌కు మాత్రం ఎన్డీఏ కూటమి తరఫున అభ్యర్థిని ప్రక టించలేదు. వైసీపీ నుంచి ఎచ్చెర్ల అసెం బ్లీకి ప్రస్తుత ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ మళ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 11:51 PM