Share News

ఏరువాకకు వేళాయే..!

ABN , Publish Date - Apr 07 , 2024 | 11:37 PM

‘ఏరువాక సాగాలో రండో చిన్నన్న’ అంటూ ఓ సినీ కవి రాసిన గీతం నేటికీ రైతులు పాడుకుంటూనే ఉంటారంటే వ్యవ సాయ పనుల్లో ఏరువాకకు ఎంత ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఏటా కొత్త అమావాస్య మరుసటి రోజున ఉగాది పర్వదినంగా అందరూ నిర్వహిస్తుంటే రైతులు కూడా వ్యవసాయ పనులను ఆరోజే ప్రారంభిస్తారు. ఉగాది పర్వదినాన తెల్లవారుజామునే పవిత్ర స్నానాలు ఆచరించి ఏరుపూసి వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు.

ఏరువాకకు వేళాయే..!
టెక్కలి: మోకులు, పలుపులు కొంటున్న రైతులు

వ్యవసాయ పనిముట్లు కొనుగోలులో రైతులు నిమగ్నం

నేడు అమావాస్య, రేపు ఉగాది

పంచాంగ శ్రవణాలకు ఆలయాల్లో ఏర్పాట్లు

నందిగాం/టెక్కలి: ‘ఏరువాక సాగాలో రండో చిన్నన్న’ అంటూ ఓ సినీ కవి రాసిన గీతం నేటికీ రైతులు పాడుకుంటూనే ఉంటారంటే వ్యవ సాయ పనుల్లో ఏరువాకకు ఎంత ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఏటా కొత్త అమావాస్య మరుసటి రోజున ఉగాది పర్వదినంగా అందరూ నిర్వహిస్తుంటే రైతులు కూడా వ్యవసాయ పనులను ఆరోజే ప్రారంభిస్తారు. ఉగాది పర్వదినాన తెల్లవారుజామునే పవిత్ర స్నానాలు ఆచరించి ఏరుపూసి వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. వ్యవ సాయం చక్కగా సాగి పాడిపంటలు వృద్ధి చెందాలని దేవదేవుని కోరు కుంటారు. దీనికి సంబంధించి పనిముట్లను కొనుగోలుకు గ్రామాల నుం చి సమీపంలోని పెద్ద ఊర్లకు, పట్టణాలకు రైతులు వస్తున్నారు. శని వారం టెక్కలి, నందిగాం మార్కెట్‌లలో మోకులు, పలుపులు, ముల కర్రలు, గునితలు తదితర సామగ్రిని కొనుగోలు చేసుకున్నారు. అలాగే చెరుకుగెడ, పిండివంటలు వండేందుకు అవసరమైన బెల్లం, ఎర్రకంద మాలం, పసుపుకొమ్ములు, మిఠాయిలు, పండ్లు కొనుగోలు చేయడం కనిపించింది. ఆలయాల్లో ఉగాది నాడు గ్రామ పురోహితులు పంచాంగ శ్రవణం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ ఏడాది ఎన్ని కుంచాల వర్షం, ఏ ప్రాంతంలో వర్షిస్తుంది, ఏ రంగు పంటలు పండుతాయి, గోవులకాపరి ఎవరు, రాజు ఎవరు, ఆదాయ, వ్యయాలు, రాజ్యపూజ్య, అవమానం తదితర వివరాలను పురోహితులు వివరిస్తారు. మంగళవారం సూర్యోదయానికి ముందు 4.30 గంటల నుంచి 5.30 గంటల మధ్య ఏరువాక, ఏరుపూత, ముటియలకు శుభప్రదమని పురోహితులు తెలిపారు.

Updated Date - Apr 07 , 2024 | 11:37 PM