Share News

చెట్ల చౌర్యంపై చర్యలకు మూడునెలలు చాలలేదా?

ABN , Publish Date - Jan 06 , 2024 | 11:13 PM

వ్యవసాయశాఖ కార్యాలయ ఆవరణలోని టేకు చెట్లను దొంగిలించిన వారిపై చర్యలు తీసుకునేందుకు మూడు నెలల సమయం చాలలేదా అని అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ప్రశ్నించారు. శనివారం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ దొర సావిత్రమ్మ అధ్యక్షతన మండల సమావేశం నిర్వహించారు.

చెట్ల చౌర్యంపై చర్యలకు మూడునెలలు చాలలేదా?

పాతపట్నం: వ్యవసాయశాఖ కార్యాలయ ఆవరణలోని టేకు చెట్లను దొంగిలించిన వారిపై చర్యలు తీసుకునేందుకు మూడు నెలల సమయం చాలలేదా అని అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ప్రశ్నించారు. శనివారం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ దొర సావిత్రమ్మ అధ్యక్షతన మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార పార్టీ నేతలే దొంగతనాలకు పాల్పడినట్లు స్వపక్ష ఎంపీటీసీలే ప్రశ్నించడంతో అధికారులు తెల్లమొఖం వేశారు. ఈ నేపథ్యంలో అధికారులు సమాధానం చెప్పాలని ఎంపీటీసీలు యరకయ్య, రేణుక పట్టుబట్టడం తో అరగంటపాటు సమావేశం నిలిచిపోయింది. గత సమావేశంలోనే ఈ అంశం ప్రస్తావించినా ఇంతవరకు చర్యలు లేవన్నారు. అటు తరువాత మరో ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో చెట్ల తొల గింపుపై టీడీపీ నేతపై కేసు పెట్టారని, అయితే అంతకుముందు జరిగిన ఘటనలో వైసీపీ నేతలపై ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. దీనికి ఎంపీడీవో జయంతిప్రసాద్‌ స్పందిస్తూ ఎస్‌ఐని ప్రశ్నిస్తానని సమాధానం చెబుతుండగా వారు అంగీకరించలేదు.సమావేశంలో జడ్పీటీసీ లింగాల ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం తేమ విషయంలో రైతులకు ఇబ్బందులు
పలాస రూరల్‌:
పండించిన పంటను మిల్లులకు తరలిస్తుంటే ధాన్యం తేమ విషయంలో మిల్లర్ల కొర్రీలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యను పరిష్కరించాలని పలువురు సభ్యులు కోరారు. ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఎంపీపీ ఉంగ ప్రవీణ అధ్యక్షతన మండల సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ.. ఆర్బీకేలో ఒకలా, మిల్లుల్లో మరోలా తేమ శాతం చూపిస్తుండడంతో రైతులు ఇక్కట్లకు గురవుతున్నారన్నారు. ఏవో పోలారావు మాట్లాడుతూ.. తేమశాతం విషయంలో ఆర్‌బీకేల ద్వారా తెలిపిన వాటితోనే రైతులు వారి పంటలను మిల్లులకు తరలించాలన్నారు. ఈ ఏడాది 3.32 కోట్ల అంచనాతో బడ్జెన్‌ను ఆమోదించారు. సమావేశంలో తహసీల్దార్‌ ఎల్‌.మధుసూదనరావు, జడ్పీటీసీ మచ్చ రత్నాలు, వైస్‌ ఎంపీపీ టి.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2024 | 11:13 PM