ఇంటర్ పరీక్షల్లో ముగ్గురు మాల్ ప్రాక్టీస్
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:52 PM
ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షల్లో బుధవా రం ముగ్గురు విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతూ స్క్వాడ్‌కు పట్టు బడ్డారు.

గుజరాతీపేట, మార్చి 6: ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షల్లో బుధవా రం ముగ్గురు విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతూ స్క్వాడ్‌కు పట్టు బడ్డారు. పాతట్నంలో ఒకరు, నౌపడ జూనియర్ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు చిక్కారు. జిల్లాలో 83 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు జనరల్ స్టడీస్‌లో 22,158 మంది విద్యార్థులకు గానూ 21,236 మంది హాజరుకాగా 920మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులో 1,391 మందికిగానూ 1269 మంది హాజరుకాగా, 121 మంది గైర్హాజరయ్యారు.