Share News

పోరాటం ఆపేది లేదు

ABN , Publish Date - Jan 01 , 2024 | 12:54 AM

తమను పర్మినెంట్‌ చేయాల్సిందేనని, అప్పటి వరకూ పోరాటం ఆపేది లేదని సమగ్ర శిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు అన్నారు.

పోరాటం ఆపేది లేదు
శ్రీకాకుళంలో సమ్మె చేస్తున్న సమగ్రశిక్ష ఉద్యోగులు

- పర్మినెంట్‌ చేయాల్సిందే

- ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల డిమాండ్‌

అరసవల్లి, డిసెంబరు 31: తమను పర్మినెంట్‌ చేయాల్సిందేనని, అప్పటి వరకూ పోరాటం ఆపేది లేదని సమగ్ర శిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు అన్నారు. జిల్లా వ్యాప్తంగా 12వ రోజు ఆదివారం సమ్మెను కొనసాగించారు. శ్రీకాకుళం నగరం లోని జ్యోతిబాపూలే పార్కు వద్ద ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల శిబిరాన్ని ఏపీటీఎఫ్‌-1938 జిల్లా అధ్యక్షుడు వి.కామేశ్వర రావు సందర్శించి మద్దతు తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించి సకాలంలో జీతాలు చెల్లించాలని, ఎంటీఎస్‌ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు పేడాడ అప్పలనాయుడు, సమగ్రశిక్ష ఉద్యోగుల యూనియన్‌ జేఏసీ జిల్లా అధ్యక్షుడు పైడి మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి తవిటినాయుడు, కోశాధికారి శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2024 | 12:54 AM