Share News

వీరి పుట్టినరోజు ప్రత్యేకమే

ABN , Publish Date - Feb 29 , 2024 | 11:47 PM

లీప్‌ సంవత్సరం వేళ.. గురువారం జిల్లాలో పలుచోట్ల చిన్నారులు జన్మించారు. సాధారణంగా ఫిబ్రవరి నెలలో 28 రోజులే. నాలుగేళ్లకోసారి వచ్చే లీఫ్‌ సంవత్సరంలో మాత్రం ఫిబ్రవరి నెలకు 29 రోజులు ఉంటాయి. ఈ ప్రత్యేకమైన దినాన జన్మించిన వారికి నాలుగేళ్లకోసారి పుట్టినరోజు వస్తుంది.

వీరి పుట్టినరోజు ప్రత్యేకమే
గురువారం శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన చిన్నారులు

‘లీప్‌’ సంవత్సరం నాడు ఏడుగురు చిన్నారుల జననం

నాలుగేళ్లకోసారి బర్త్‌డే వేడుకలంటూ తల్లిదండ్రుల హర్షం

అరసవల్లి/ శ్రీకాకుళం అర్బన్‌/ పలాస/ నరసన్న పేట/ పాతపట్నం, ఫిబ్రవరి 29: లీప్‌ సంవత్సరం వేళ.. గురువారం జిల్లాలో పలుచోట్ల చిన్నారులు జన్మించారు. సాధారణంగా ఫిబ్రవరి నెలలో 28 రోజులే. నాలుగేళ్లకోసారి వచ్చే లీఫ్‌ సంవత్సరంలో మాత్రం ఫిబ్రవరి నెలకు 29 రోజులు ఉంటాయి. ఈ ప్రత్యేకమైన దినాన జన్మించిన వారికి నాలుగేళ్లకోసారి పుట్టినరోజు వస్తుంది. ఇలా.. గురువారం శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(రిమ్స్‌)లో ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి సమీపాన రాణిపేటకు చెందిన పిల్లా ప్రమీలకు రెండో కాన్పులో భాగంగా మగ శిశువు జన్మించాడు. అలాగే బుడు మూరుకు చెందిన భీంపల్లి గౌరి రెండో కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది.

- పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో మందస మండలం సందిగాం గ్రామానికి చెందిన సవర సరోజినికి కుమారుడు జన్మించాడు.

- నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ముగ్గురు చిన్నారులు జన్మించారు. పోలాకి మండలం మతలబుపేటకు చెందిన బొం గు లైల మొదటి కాన్పులో కుమార్తెకు జన్మనిచ్చింది. సారవకోట మేదరవీధికి చెందిన తులుగాపు హేమలతకు రెండో కాన్పులో కుమారుడు పుట్టాడు. మబుగాం గ్రామానికి చెందిన పి.వసంతకు తొలి కాన్పులో కుమార్తె జన్మించింది.

- అలాగే పాతపట్నం సీహెచ్‌సీలో ఏఎస్‌ కవిటికి చెందిన లక్ష్మీకి కుమార్తె పుట్టింది. దీంతో తమ చిన్నారుల పుట్టినరోజు ఎంతో ప్రత్యేకమని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రుల సిబ్బంది, వైద్యులు సైతం వారిని అభినందించారు.

Updated Date - Feb 29 , 2024 | 11:47 PM