Share News

శ్రీచక్రాలయంలో చోరీ

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:28 AM

ఎచ్చెర్ల మండలం కుంచాల కురమయ్యపేట శ్రీచక్రాలయంలో మంగళ వారం అర్ధరాత్రి చోరీ జరిగింది. 30 తులాల వరకు బంగారం, సుమారు వంద తులా ల వెండితోపాటు రూ.40 లక్షల నగదు చోరీ జరిగినట్లు పీఠాధిపతి తేజోమూర్తుల బాల భాస్కరశర్మ పోలీసులకు ఫిర్యా దు చేశారు.

శ్రీచక్రాలయంలో చోరీ
ఎచ్చెర్ల: గర్భాలయంలో ఆధారాలు సేకరిస్తున్న క్లూస్‌ బృందం

బంగారు, వెండి ఆభరణాలతో పాటు రూ.40 లక్షలు అపహరణ

ఎచ్చెర్ల, ఫిబ్రవరి 24: ఎచ్చెర్ల మండలం కుంచాల కురమయ్యపేట శ్రీచక్రాలయంలో మంగళ వారం అర్ధరాత్రి చోరీ జరిగింది. 30 తులాల వరకు బంగారం, సుమారు వంద తులా ల వెండితోపాటు రూ.40 లక్షల నగదు చోరీ జరిగినట్లు పీఠాధిపతి తేజోమూర్తుల బాల భాస్కరశర్మ పోలీసులకు ఫిర్యా దు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి.. సాధారణ రోజుల్లో ఆభరణాలన్నీంటినీ ఏ రోజుకారోజు తీసి భద్రపరిచేవారు. అయితే మంగళ వారం పౌర్ణమి కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో అమ్మ వారికి అలంకరించిన ఆభరణాలను తీయలేదు. వివిధ పూజా కార్యక్రమాలకు సేకరించిన సుమారు రూ.40 లక్షల నగదు గర్భగుడిలో ఉంచి రాత్రి ఒంటి గంట సమయంలో తాళం వేశారు. బుధవారం వేకువజామున నాలుగు గంటలకు నిత్య పూజలకు గాను ఆలయం తెరిచి చూసే టప్పటికీ అమ్మవారి ఆభరణాలు, నగదు కనిపించ కపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా ఆలయంలో ఉన్న హుండీలను కూడా దుండగులు ఎత్తుకు పోయి వాటిలో ఉన్న నగదు, కానుకలు దోచి హుండీలను సమీప పొలాల్లో వదిలేశారు. ఆలయ ప్రాంగణంతో పాటు గర్భగుడిలోని సీసీ కెమెరాలతో పాటు డీవీఆర్‌ (రికార్డు అయిన చిప్‌బాక్స్‌)ను ఎత్తుకు పోయారు. ఈ దోపిడీలో ఐదుగురు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమి కంగా గుర్తించారు. కొద్ది రోజుల నుంచి నిర్వహిస్తున్న వసంత నవరాత్రి ఉత్సవాలు, కోటి శివలింగాల ఏర్పాటుకు సంబంధించి వివరాళాలు సేకరించిన మొత్తం నగదు కూడా ఆలయ గర్భగుడిలో ఉంచినట్లు సమాచారం. ఇదిలా ఉండగా సీఎం, ప్రతిపక్ష నేతలిద్దరూ జిల్లాలోనే ఉండడంతో పోలీసు లంతా వారి బందోబస్తులో ఉండగా ఇదే అదునుగా దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంత భారీగా ఈ ప్రాంతంలో గతంలో ఎన్నడూ జరగకపోవడంతో ప్రజలు ఆందో ళన చెందు తున్నారు. పీఠాధిపతి ఫిర్యాదు మేరకు బుధవారం ఉదయం ఆరు గంటలకు పోలీ సులు, క్లూస్‌టీమ్‌ ఘటనా స్థలాన్ని సందర్శించి ఆధారాలను సేకరించారు. ఎచ్చెర్ల పోలీసులు వివరాల నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కాటమ్మ ఆలయంలోనూ..

పలాసరూరల్‌: తర్లాకోట సమీపంలోని కాటమ్మ ఆలయంలో మంగళవారం రాత్రి దొంగలు చొరబడి తాళాలను పగలగొట్టి హుండీని దోచుకున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగిన నేపథ్యంలో ఆలయం చుట్టుపక్కల గ్రిల్స్‌ను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తు తం ఆ గ్రిల్స్‌ను కోసి ఆలయం లోపలకు వెళ్లేందుకు దొంగలు ప్రయత్నించినా కుదరక పోవ డంతో హుండీని దోచు కున్నారు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం పూజారి ఆలయం తలు పులు తెరిచి చోరీ జరిగినట్లు గుర్తించి ఆలయ కమిటీ సభ్యులకు తెలిపారు. ఈ నేపథ్యంలో వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రతి మంగళ, ఆదివారాల్లో ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుండడం, కానుకలు సమర్పిస్తుండ డంతో చోరీకి పాల్పడి ఉంటారని పలువురు గ్రామస్థులు పేర్కొంటున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:28 AM