Share News

కుమారుడిని అప్పగించాలని మహిళ ఆందోళన

ABN , Publish Date - Jul 15 , 2024 | 11:10 PM

తన కుమారుడిని భర్త చెర నుంచి కాపాడి తనకు అప్పగించాలని పలాస అన్నపూర్ణ ఆశ్రమం కాలనీకి చెందిన నెయ్యిల అరుణ వేడుకు న్నారు.

 కుమారుడిని అప్పగించాలని మహిళ ఆందోళన

పలాస: తన కుమారుడిని భర్త చెర నుంచి కాపాడి తనకు అప్పగించాలని పలాస అన్నపూర్ణ ఆశ్రమం కాలనీకి చెందిన నెయ్యిల అరుణ వేడుకు న్నారు. ఈ మేరకు కేటీ రోడ్డు ఆర్టీసీ కాంప్లెక్స్‌ వివేకానంద విగ్రహం వద్ద సోమవారం వర్షంలో ఆందోళనకు దిగింది. దీనికి సంబంధించిన బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. వజ్రపుకొత్తూరు మండలం సంకర జగన్నాఽథపురానికి చెందిన నెయ్యిల లోకేష్‌తో అరుణకు 2019లో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడున్నాడు. వివాహమైన రెండు నెలల నుంచి ఇద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చాయని, పెద్ద మను షులు, కుటుంబీకులు ఎంత సర్దిచెప్పినా ఫలితం లేకపోయిం దన్నారు. భర్త వేధింపులు ఎక్కువ కావడంతో కన్నవారి గ్రామం పలాస వచ్చి ఇక్కడే ఉండి పోయానన్నారు. తన కుమారుడిని పంపించాలని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తన వద్దకు పంపించారని, ఆ తరువాత పోలీసులు తండ్రి వద్దకు పంపించాలని ఒకసారి, గ్రామంలో సంబరాలు ఉన్నా యని మరోసారి, తన మామకు ఒంట్లో బాగో లేదని.. ఇలా అనేకమార్లు పోలీసులు ఫోన్‌ చేసి ఇబ్బందులు పెట్టారన్నారు. పోలీసుల అండతోనే ఓ సారి భర్త లోకేష్‌ తనపై దాడి చేసి కుమారుడిని తీసుకెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి తన కుమారుడ్ని అప్పగిం చాలని అభ్యర్థించింది. ఈ వ్యవహారంపై కాశీబుగ్గ ఎస్‌ఐ పారి నాయుడును వివరణ కోరగా కుమారుడిని తండ్రి చూసు కునేందుకు వీలుగా వారి మధ్య ఒప్పందం జరిగిందని, ఆ విధంగానే కుమారుడిని తండ్రి తీసుకువెళ్లాడన్నారు. తండ్రి చావు బతుకుల్లో ఉన్నందున మనుమడికి చివరి చూపైనా చూపిస్తానని భర్త లోకేష్‌ కోరి తీసుకువెళ్లాడన్నారు. భార్యా భర్తల వ్యవహారంలో తాము ఎవరి పక్షాన ఉండబోమని, చట్ట ప్రకారం అంతా జరుగుతుందని స్పష్టం చేశారు.

Updated Date - Jul 15 , 2024 | 11:10 PM