Share News

కాలగర్భంలో కలిసిన పది నియోజకవర్గాలు

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:11 AM

స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటైంది. కాలానుగుణంగా అవసరం మేరకు మార్పులు, చేర్పులకు, లోపాల సవరణకు రాజ్యాంగం మనకు వెసులుబాటు కల్పించింది. ఇందులో నియోజకవర్గాల పునర్విభజన ఒకటి. జనాభా పెరుగుదలకు అనుగుణంగా నియోజకవర్గాల పునర్విభజన నిర్ణీత కాలవ్యవధిలో చేస్తుంటారు.

కాలగర్భంలో కలిసిన పది నియోజకవర్గాలు

పునర్విభజనతో కోల్పోయిన సెగ్మెంట్లు - అవి ఇక పాత జ్ఞాపకాలే

(రణస్థలం)

స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటైంది. కాలానుగుణంగా అవసరం మేరకు మార్పులు, చేర్పులకు, లోపాల సవరణకు రాజ్యాంగం మనకు వెసులుబాటు కల్పించింది. ఇందులో నియోజకవర్గాల పునర్విభజన ఒకటి. జనాభా పెరుగుదలకు అనుగుణంగా నియోజకవర్గాల పునర్విభజన నిర్ణీత కాలవ్యవధిలో చేస్తుంటారు. కాలక్రమంలో కొన్ని నియోజకవర్గాలు చరిత్ర పుటల్లో కలిసిపోతుండగా, మరికొన్ని నియోజకవర్గాలు కొత్త చరిత్రను ఆవిష్కరిస్తుంటాయి. శ్రీకాకుళం జిల్లాను ఒకసారి పరిశీలిస్తే.. చరిత్ర పుటల్లో కలిసిపోయిన నియోజకవర్గాలు పది ఉన్నాయి. ఇందులో పొందూరు, ఎస్‌ఎంపురం, హొంజరాం, బ్రాహ్మణతర్ల నగరికటకం, హరిశ్చంద్రపురం, ఉణుకూరు, సోంపేట, కొత్తూరు నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రజలకు మరింత మెరుగైన సేవలందించడమే నియోజకవర్గాల పునర్విభజన ఉద్దేశ్యమైనప్పటికీ, కొన్నింటి విషయంలో అందుకు విరుద్ధంగా జరుగుతున్నాయని చరిత్ర చెబుతోంది. ఇందులో పొందూరును ప్రముఖంగా చెప్పుకోవచ్చు. 1967లో చీపురుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి విడిపోయి పొందూరు నియోజకవర్గం ఏర్పాటైంది. 1962లో పొందూరు (ఎస్సీ) సెగ్మెంట్‌ నుంచి కొత్తపల్లి పున్నయ్య (కాంగ్రెస్‌) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే పున్నయ్యకు జిల్లా జడ్జి ఉద్యోగం రావడంతో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 1964లో జరిగిన ఉప ఎన్నికలో కొత్తపల్లి నరసయ్య (కాంగ్రెస్‌) ఎన్నిక య్యారు. 1967లో ఈ నియోజకవర్గం జనరల్‌ కేటగిరీకి మారింది. ఆ ఎన్నికల్లో చౌదరి సత్యనారాయణ (స్వతంత్ర పార్టీ) గెలుపొందారు. 1972లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లుకలాపు లక్ష్మణదాసు (కాంగ్రెస్‌) విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో అప్పటి ఎస్‌ఎంపురం సమితి అధ్య క్షుడు టంకాల అక్కలనాయుడు (ఇండిపెండెంట్‌), గురుగుబెల్లి స్వామినాయుడు ఓటమి చవిచూశారు. పొందూరు శాసనభ్యునిగా ఎన్నికైన లుకలాపు లక్ష్మణదాసు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖామంత్రిగా కూడా వ్యవహరించి, చీపురుపల్లి నుంచి విడదీసి పొందూరులో కొత్తగా తాలుకాను ఏర్పాటుచేశారు. పొందూరు నియోజకవర్గం 18 ఏళ్లకే అంతమైంది. 1978 ఎన్నికల్లో పొందూరు ప్రాంతం చీపురుపల్లి నియోజకవర్గంలో విలీనమైంది. 2004 ఎన్నికల వరకు పొందూరు, జి.సిగడాం మండలాలు చీపురుపల్లి నియోజకవర్గంలోనే అంతర్భాగంగా ఉండేవి. 2009లో జరిగిన పునర్విభజనలో పొందూరు మండలం ఆమదావలస నియోజకవర్గంలో, జి.సిగడాం మండలం ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో విలీనమయ్యాయి.

- జిల్లాలో ఎస్‌ఎంపురం గ్రామానికి ఓ విశిష్టత ఉంది. ఈ గ్రామం కొన్నాళ్లపాటు నియోజకవర్గ, సమితి కేంద్రంగా ఉండేది. 1955లో అవతరించిన ఎస్‌ఎంపురం సెగ్మెంట్‌ 1967లో అంతరించిపోయింది. 1955లో జరిగిన ఎన్నికల్లో కృషికార్‌ లోక్‌పార్టీ అభ్యర్థిగా చౌదరి సత్య నారాయణ ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు. 1962లో జరిగిన ఎన్నికల్లో ఆ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి బల్లాడ హరప్పడు రెడ్డి (ఇండిపెండెంట్‌) ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఈ సెగ్మెంట్‌ ఎచ్చెర్ల అసెంబ్లీగా రూపాం తరం చెందింది. 1952లో అవతరించిన హొంజరాం అసెంబ్లీ నియో జకవర్గం మూడేళ్లకే గతి నుంచి తప్పుకుంది. 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ సెగ్మెంట్‌ నుంచి పీసపాటి పుండరీకాక్షాచార్యులు ఎన్నిక య్యారు. ఈ సెగ్మెంట్‌ పాలకొండలో కలిసిపోయింది. 1955లో అవతరిం చిన బ్రాహ్మణతర్ల అసెంబ్లీ సెగ్మెంటు 1967లో అంతరించిపోయింది. 1955లో జరిగిన ఎన్నికల్లో ఈ సెగ్మెంట్‌ నుంచి కృషికార్‌ లోక్‌పార్టీ అభ్యర్థి నిచ్చెర్ల రాములు ఎన్నికయ్యారు. 1962లో జరిగిన ఎన్నికల్లో బెండి లక్ష్మీనారాయణమ్మ ఎన్నికయ్యారు. 1967లో ఈ సెగ్మెంట్‌ టెక్కలి సెగ్మెంట్‌లో కలిసిపోయింది. అలాగే 1965లో ఏర్పాటైన నగరికటకం సెగ్మెంట్‌ 1978 వరకు కొనసాగింది. ఇక్కడి నుంచి 1955, 1962, 1967లో తమ్మినేని పాపారావు (కాంగ్రెస్‌) ఎన్నికయ్యారు. ఆ తర్వాత నగరిక టకం నియోజకవర్గం ఆమదావలస నియోజకవర్గంగా ఏర్పాటైంది. 2009 నియోజకవర్గ పునర్విభజనలో జిల్లాలోని హరిశ్చంద్రపురం, ఉణుకూరు, సోంపేట, కొత్తూరు నియోజకవర్గాలు అంతరించిపోయా యి. ఉణుకూరు నియోజకవర్గం రాజాంగా ఏర్పడింది. అప్పటికే టెక్కలి నియోజకవర్గంలో హరిశ్చంద్రపురంలోని కొంత ప్రాంతం కలిసింది. సోంపేట నియోజకవర్గంలోని కొంతభాగం కొత్తగా ఏర్పడిన పలాసలో, మరికొంత ప్రాంతం ఇచ్ఛాపురంలో విలీనమైంది. 2009 సంవత్సరంలో జరిగిన పునర్విభజనలో శ్రీకాకుళం జిల్లాలో 12 అసెంబ్లీ నియో జకవర్గాలు 10 అసెంబ్లీ సెగ్మెంట్‌లుగా ఏర్పడ్డాయి. పాలకొండ ఎస్టీలకు, రాజాం ఎస్సీలకు రిజర్వ్‌ చేశారు. రెండేళ్ల క్రితం జరిగిన జిల్లాల పునర్విభజనలో పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం పార్వతీపురం మన్యం జిల్లాలో, రాజాం నియోజకవర్గం విజయనగరం జిల్లాలో విలీనమయ్యాయి.

Updated Date - Apr 18 , 2024 | 12:11 AM