Share News

ఇసుక దోపిడీలో వాటాల నిగ్గు తేల్చాలి

ABN , Publish Date - Feb 25 , 2024 | 12:14 AM

ఇసుక అక్రమ దోపిడీలో స్థానిక వైసీపీ నాయకులకు, తాడేపల్లి ప్యాలెస్‌కు వాటాలు ఎంతెంత అనేది నిగ్గు తేల్చాలని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి డిమాండ్‌ చేశారు.

ఇసుక దోపిడీలో వాటాల నిగ్గు తేల్చాలి
దొంపాక ఇసుకర్యాంపు వద్ద నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

ఇసుక అక్రమ దోపిడీలో స్థానిక వైసీపీ నాయకులకు, తాడేపల్లి ప్యాలెస్‌కు వాటాలు ఎంతెంత అనేది నిగ్గు తేల్చాలని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి డిమాండ్‌ చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వ హిస్తున్న దొంపాక ఇసుక ర్యాంపు వద్ద శనివారం టీడీపీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరిత ట్రిబ్యునల్‌ ఆదేశాలను ధిక్కరిస్తూ ఇసుక తవ్వకాలు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వంశధార నదిలో రోడ్డు నిర్మించి 3 మీటర్ల లోతులో ఇసుక తవ్వకాలు జేసీబీల ద్వారా చేపట్టి అక్రమంగా తరలిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కొమనాపల్లి వంతెనకు కూత వేటు దూరంలో దొంపాక వద్ద ఇసుక ర్యాంపు ను అక్రమంగా నిర్వహిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బగ్గు గోవిందరావు, కింజరాపు సత్యం, తర్ర బలరాం, పి.దాలయ్య, జి.బాలకృష్ణ, శిమ్మ తారకేశ్వరరావు, నక్క రమేష్‌, బైరి భాస్కరరావు, రోణంకి కృష్ణంనాయుడు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 12:14 AM