Share News

ఉద్యమ స్ఫూర్తి ‘గరిమెళ్ల’

ABN , Publish Date - Jul 15 , 2024 | 11:11 PM

‘మాకొద్దీ తెల్లదొరమంటూ’ గర్జించి స్వాతంత్య్ర సమరంలో ఉద్యమ స్ఫూర్తి రగిలించిన వ్యక్తి గరిమెళ్ల సత్యనారాయణ అని మాజీ ఎమ్మెల్యే కేఏఎన్‌ భుక్త అన్నారు.

ఉద్యమ స్ఫూర్తి ‘గరిమెళ్ల’

జయంతి, వర్ధంతులను అధికారికంగా చేపట్టాలి

మాజీ ఎమ్మెల్యే కేఏఎన్‌ భుక్త

ప్రియాగ్రహారం(పోలాకి): ‘మాకొద్దీ తెల్లదొరమంటూ’ గర్జించి స్వాతంత్య్ర సమరంలో ఉద్యమ స్ఫూర్తి రగిలించిన వ్యక్తి గరిమెళ్ల సత్యనారాయణ అని మాజీ ఎమ్మెల్యే కేఏఎన్‌ భుక్త అన్నారు. స్వాతం త్య్ర సమరయోధుడు, జాతీయ గేయ కవి గరిమెళ్ల 131వ జయంతి ఉత్సవాన్ని సోమవారం ప్రియా గ్రహారం జూనియర్‌ కళాశాలలో నిర్వహించారు. ఈ సంద ర్భంగా గరిమెళ్ల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పిం చారు. అనంతరం మాట్లాడుతూ.. గరిమెళ్ల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభు త్వం అధికారికంగా చేపట్టడం ద్వారా ఆయన స్వాతంత్య్రసమరంలో ఆయన చేసిన త్యాగాన్ని గుర్తిం చిన వారవుతారన్నారు. ఈ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసు కోవాలని కోరారు. జిల్లాకు గరిమెళ్ల జిల్లాగా ప్రకటించాలన్నా రు. ప్రియా గ్రహారంలో గరిమెళ్ల ఏర్పాటు చేసిన శారదా గ్రంథాలయాన్ని పునరుద్ధరించాలని, ఆయన రచనలను పున ర్ముద్రించి గ్రంథాలయాలు, పాఠశాలలకు అందించాలని కమి టీ సభ్యులు, మాజీ సర్పంచ్‌ లావేటి కృష్ణ, ఎంపీటీసీ ప్రసా ద్‌, హెచ్‌ఎం విశ్వేశ్వరరావు, ప్రిన్సిపాల్‌ సింహంబట్ల నాగ కుమారి, బాడాన రాజు కోరారు. అనంతరం పది, ఇంటర్‌ పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను అభినం దించారు. గరిమెళ్ల రాసిన మాకొద్దీ తెల్లదొరతనమూ.. పాట ను ఇలపండ గణపతి లయబద్ధంగా పాడి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ మడ్డు అప్పయ్య, దుబ్బ కోటే ్వరరావు, గోపి, ధనుంజయ, మడ్డు అప్పలరాజు, రామారావు, గరిమెళ్ల కుటుంబ సభ్యులు, ఎలిమెంటరీ, ఉన్నత పాఠశాల, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2024 | 11:11 PM