మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:51 PM
విలీన మున్సిపల్ కార్మికులకు వెంటనే డివిజన్ ఏర్పాటు చేసి, దీర్ఘ కాలిక సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరు పతిరావు, మున్సిపల్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.అప్పలరాజు డిమాండ్ చేశారు.

- ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు
అరసవల్లి: విలీన మున్సిపల్ కార్మికులకు వెంటనే డివిజన్ ఏర్పాటు చేసి, దీర్ఘ కాలిక సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరు పతిరావు, మున్సిపల్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.అప్పలరాజు డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం మున్సిపల్ కార్యాలయం ఎదుట వారు నిరసన కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2017లో విలీన పంచా యతీ కార్మికులను నగర కార్పొరేషన్‌లో విలీనం చేశారని, కానీ ఇంతవరకు వారికి డివిజన్ ఏర్పాటు చేయలేదన్నారు. ముఖ్యంగా మున్సిపల్ ఆరోగ్య అధికారి ఈ విష యంతో తాత్సారం చేస్తున్నారని, ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక ్తం చేశారు. అలాగే పర్మినెంట్ కార్మికులకు ఇవ్వాల్సిన సరెండర్ లీవులు, ఇంక్రిమెంట్లు అమలు చేయాలని కోరారు. నగర పారిశుధ్య అవసరాలకు సరిపడా కార్మికులను ని యమించాలని, వారికి వృత్తి పరికరాలు, రక్షణ పరికరాలు సరఫరా చేయాలని డి మాండ్ చేశారు. యూనిఫారాలు ఇవ్వాలని, స్టిచ్చింగ్ చార్జీలను వెంటనే చెల్లించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిం చారు. కార్యక్రమంలో నాయకులు జె.గురుమూర్తి, ఎస్.బాబూరావు, పార్థసారథి, ఆర్ గణేష్, పి.గోపి, కూర్మారావు, సింగ్, రామచంద్ర, తారక, సోగ్గాడు, రసూల్, మంగవేణి, సరస్వతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.