Share News

సమస్య మళ్లీ మొదటికి..!

ABN , Publish Date - Jan 03 , 2024 | 11:33 PM

గొడ్డ- అంపురం రోడ్డు సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.. 15 ఏళ్ల కిందట గొడ్డ జంక్షన్‌ నుంచి రింపి మీదుగా పాతపట్నం మండ లం బడ్డుమర్రి వరకు ఐటీడీఏ నిధులతో రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే ఈ మా ర్గంలో ఒక రైతుకు సంబంధించిన జిరాయితీ ఉండగా దానిమీదుగా రోడ్డు వేశారు. అయితే సదరు రైతు తన పొలంలో రోడ్డు తవ్వి చదును చేస్తుండడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.

సమస్య మళ్లీ మొదటికి..!
గొడ్డ-అంపురం రహదారిని ఎక్స్‌కవేటర్‌తో తవ్విన దృశ్యం

గొడ్డ-అంపురం మధ్య రోడ్డు తవ్వేశారు

గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్‌

జిరాయితీ భూమిలో రోడ్డు వేయడంతోనే...

మెళియాపుట్టి, జనవరి 3: గొడ్డ- అంపురం రోడ్డు సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.. 15 ఏళ్ల కిందట గొడ్డ జంక్షన్‌ నుంచి రింపి మీదుగా పాతపట్నం మండ లం బడ్డుమర్రి వరకు ఐటీడీఏ నిధులతో రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే ఈ మా ర్గంలో ఒక రైతుకు సంబంధించిన జిరాయితీ ఉండగా దానిమీదుగా రోడ్డు వేశారు. అయితే సదరు రైతు తన పొలంలో రోడ్డు తవ్వి చదును చేస్తుండడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. దీంతో అనంతగిరి, ఏగువలనంతగిరి, రింపి, మూలరింపి, అంపురం, బంజరు, గొందర పేట గ్రామాలకు రాక పోకలు లేక వాహనదార్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా గత ఏడాది ఆగస్టులో ఇలాగే జరగడంతో ఎంపీడీవో చొరవతో రోడ్డు వేశారు. అయితే సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఎమ్మెల్యే రెడ్డి శాంతిని అనేక పర్యాయాలు కోరినా ప్రయోజనం కనిపిం చడం లేదని ఇలాపురం సర్పంచ్‌ గవిరేస్‌ అవేదన వ్యక్తంచేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సైతం వాహనాలు రాలేక ఇబ్బం దులు పడుతున్నట్లు పేర్కొన్నారు. మళ్లీ బుధవారం సదరు రైతు ఎక్స్‌కవేటర్‌తో రోడ్డును తవ్వడం తో గిరిజనులు ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు స్పందించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని వారు కోరుతున్నారు. దీనిపై ఎంపీడీవో చంద్రకుమారిని వివరణ కోరగా సంబంధిత యజమానితో చర్చించి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. గత ఏడాది నుంచి ఇదే పరిస్థితి ఉందని, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి రాకపోకలు సాగించేలా కృషి చేస్తామన్నారు.

Updated Date - Jan 03 , 2024 | 11:33 PM